Newsవావ్: పాన్ ఇండియా సినిమాలో చిరంజీవి.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు...

వావ్: పాన్ ఇండియా సినిమాలో చిరంజీవి.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోస్ ఎలా దూసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యంగ్ హీరోలే మూడు సంవత్సరాలకు ఒక సినిమా నాలుగు సంవత్సరాలకి రెండు సినిమాలు రిలీజ్ చేస్తుంటే.. సీనియర్ హీరోలు మాత్రం ఏకంగా సంవత్సరానికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు . సినిమాని కమిట్ అవ్వడమే కాదు కమిట్ అయిన సినిమాలు వాటికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు రిలీజ్ చేసేస్తున్నారు సీనియర్ హీరోళు. ఆ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ టాప్ పొజిషన్లో ఉన్నారు .

యంగ్ హీరోస్ చేయలేని పని కూడా ఈ హీరోలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. కాగా రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ భోలా శంకర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమా తర్వాత బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో ..బింవిసారా సినిమా డైరెక్టర్ వశిష్ట తో ఓ సినిమా చేస్తున్నాడు అన్న విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

అయితే కళ్యాణ్ కృష్ణ తో చేసే సినిమా ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కబోతుందట. అయితే వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా మాత్రం ఫుల్ టు ఫుల్ సోషియో ఫాంటసీ మూవీ గా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ మొత్తం డైరెక్టర్ చిరంజీవికి వివరించేశారట .అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . సెకండ్ ఇన్నింగ్స్ లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతున్న ఫస్ట్ సినిమా ఇదే కావడం గమనార్హం . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news