Movies"చరణ్ కోసం ఆ ముడతల ముఖందా..?" ..బుచ్చిబాబు కి మెగా ఫ్యాన్స్...

“చరణ్ కోసం ఆ ముడతల ముఖందా..?” ..బుచ్చిబాబు కి మెగా ఫ్యాన్స్ స్ట్రైట్ వార్నింగ్.. !!

బుచ్చిబాబు సన తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ .. తెలిసి తెలియక తనంతో చేస్తున్న తప్పులు ఇప్పుడు ఆయనను సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురయ్యేలా చేస్తున్నాయి . మనకు తెలిసిందే సుకుమార్ శిష్యుడిగా సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకున్న బుచ్చిబాబు చేసిన ఒకే ఒక్క సినిమా ఉప్పెన. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది . మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బుచ్చిబాబు సన కెరియర్నే మార్చేసింది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయి చాలా కాలం గడుస్తుంది . ఇప్పటివరకు సెకండ్ సినిమాని సెట్స్ పై కి తీసుకెళ్లని బుచ్చిబాబు సన.. త్వరలోనే రామ్ చరణ్ తో తన సెకండ్ సినిమాను గ్రాండ్ గా ప్రారంభించబోతున్నారు అంటూ తెలుస్తుంది . అయితే ఇలాంటి క్రమంలోనే సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న బుచ్చిబాబు సన ఓ విషయంలో మాత్రం తప్పు చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా కృతి శెట్టి ని సెలక్ట్ చేసుకున్నారట. అయితే ఎందుకో మొదటి నుండి మెగా ఫ్యాన్స్ కి కృతి అంటే పెద్ద నచ్చదు. మేకప్ లేకపోతే ముఖాన ముడతలు ఉంటాయి అని చెప్పుకొస్తూ ఉంటారు. అంతేకాదు ఓ కీలక పాత్ర కోసం తమిళ్ స్టార్ మల్టీ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి ని సంప్రదించినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఈ క్రమంలోనే ఉప్పెన కాంబోనే మళ్లీ రిపీట్ చేయబోతున్నావా ..? అంటూ ఏకిపారేస్తున్నారు జనాలు. అంతేకాదు అలాంటప్పుడు దీనికి ఉప్పెన2 అంటూ టైటిల్ పెట్టు అని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో బుచ్చిబాబు సన పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news