Movies"బొమ్మరిల్లు" టైటిల్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? దిల్ రాజు తెలివికి...

“బొమ్మరిల్లు” టైటిల్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? దిల్ రాజు తెలివికి దండం పెట్టాల్సిందే..!!

ఒక సినిమా హిట్ అవ్వాలన్నా.. ఫట్ అవ్వాలన్న డైరెక్టర్ – హీరో – హీరోయిన్ ఎంత ముఖ్యమో .. ఆ సినిమాకి పేరు కూడా అంతే ముఖ్యం. ఈ విషయం మనందరికీ తెలిసిందే. హీరో ఎంత బాగా నటించినా ..హీరోయిన్ ఎంత బాగా ఎక్స్పోజ్ చేసిన .. డైరెక్టర్ కూడా బాగా దర్శకత్వం వహించిన .. సినిమా టైటిల్ బాగోలేకపోతే జనాల్లోకి రీచ్ అవ్వలేదు . అందుకే సినిమా డైరెక్టర్లు అందరూ సినిమాలకు పెట్టే పేర్లు విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటారు . మరి కొందరు డైరెక్టర్లు తమకు అచ్చు వచ్చిన లెటర్స్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడుతూ ఉంటారు.

అయితే భాస్కర్ మాత్రం వాళ్లందరిలోకి ప్రత్యేకమని చెప్పాలి . ఆయన సినిమాలకు పేర్లు పెట్టే విషయంలో చాలా ఫన్నీ ఫన్నీ థింగ్స్ ను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడట. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు టైటిల్ విషయంలో చాలా ఫన్నీగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చేవాడట. ఈ క్రమంలోనే ఆయన కెరియర్నే మలుపు తిప్పిన బొమ్మరిల్లు సినిమా టైటిల్ విషయంలో భాస్కర్ తీసుకున్న నిర్ణయం ఇప్పటికి వాళ్ళ ఇంట్లోని వాళ్లకి సినిమా మేకర్స్ కి నవ్వులు తెప్పిస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి .

కాక టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సిద్ధార్ధ్ హీరోగా.. హీరోయిన్ గా జెనీలియా నటించిన సినిమా “బొమ్మరిల్లు”. ఈ సినిమా అప్పట్లో ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెట్టిన దానికి దాదాపు 5రెట్లు లాభాలు తీసుకొచ్చి సినిమా లెక్కలను మార్చేసింది . అంతే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా బడా స్టార్ హీరోలు కూడా సిద్ధార్ధ్ నటనకి జెనీలియా అల్లరికి భాస్కర్ దర్శకత్వానికి ఫిదా అయిపోయారు. కాగా ఈ సినిమా జనాల్లోకి అంత బాగా రీచ్ అవ్వడానికి కారణం సినిమా టైటిల్ అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

అయితే ఈ సినిమాకు టైటిల్ చూస్ చేసుకునే విషయంలో భాస్కర్ చాలా ఫన్నీ గా ప్రవర్తించాడట. ఈ సినిమా షూటింగ్ కి సిద్ధమైన తర్వాత టైటిల్ ఏం పెట్టాలి అని మేకర్స్ ఆలోచిస్తున్న క్రమంలో దిల్ రాజుకు వైవిఎస్ చౌదరి ఇచ్చిన ఇన్విటేషన్ భాస్కర్ కంట కనపడిందట. అందులో కార్డుపై బొమ్మరిల్లు అనే పేరు చూశాడట . కరెక్ట్ గా అదే విషయాన్ని దిల్ రాజు కి కూడా చెప్పగా దిల్ రాజు సైతం ఇంప్రెస్ అయిపోయి బొమ్మరిల్లు టైటిల్ నే పెడదామంటే ఫిక్స్ అయ్యారట . అయితే అప్పటికే భాస్కర్ ఈ సినిమా కోసం రెండు మూడు టైటిల్స్ అనుకున్న దిల్ రాజు మాత్రం బొమ్మరిల్లు సినిమాకి బొమ్మరిల్లు టైటిల్ కి కమిట్ అయిపోయి ..ఆ పేరుని పెట్టారట . ఈ సినిమా హిట్ అవ్వడానికి హీరో – హీరోయిన్ – దర్శకుడు ఎంత కారణమో.. టైటిల్ కూడా అంతే కారణం అనే సంగతి మనం మర్చిపోకూడదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news