Moviesవిజయ్ వర్మ కంటే ముందే తమన్నా కు "ఐ లవ్ యూ"...

విజయ్ వర్మ కంటే ముందే తమన్నా కు “ఐ లవ్ యూ” చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా..? అది కూడా అయిపోయిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ప్రెసెంట్ టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . రీసెంట్ గానే బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ రెండు వెబ్ సిరీస్ లో నటించి హ్యూజ్ హిట్స్ అందుకున్న తమన్నా త్వరలోనే తెలుగులో భోళాశంకర్ సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతుంది. ఇలాంటి క్రమంలోనే తమన్నాకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి .

మనకు తెలిసిందే లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ వర్మతో డేటింగ్ ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది . విజయవర్మ సైతం తమన్నా ని లవ్ చేస్తున్నాను అంటూ ఓకే చెప్పేసాడు . అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం త్వరలోనే పెళ్లి గా మారబోతుంది అంటూ ఫ్యాన్స్ అనుకునే లోపే వీళ్ళిద్దరూ విడిపోయారు అంటూ బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధూ ట్వీట్ చేసి అభిమానుల గుండెల్లో రైలు పరిగెత్తేలా చేశారు.

అయితే ఇది మొత్తం ఫేక్ అంటూ తెలుస్తుంది. విజయ్ వర్మ తమన్నా విడిపోలేదని వాళ్ళు కలిసే ఉన్నారు అని బాలీవుడ్ ప్రముఖులు చెప్పుకుంటున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే తమన్నకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . తమన్నా కి విజయ్ వర్మ కన్నా ముందే ఓ స్టార్ హీరో ఐ లవ్ యు చెప్పాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఆ హీరో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరోగా తెలుస్తుంది. తమన్నా కోలీవుడ్ లో సినిమాలు చేసే టైంలో ఈ హీరోతో ఎక్కువగా రాసుకుని పూసుకుని తిరిగిందని ..అంతేకాదు ప్రేమాయణం కూడా నడిపి ఆ ఇంటికి కోడలుగా వెళ్లాలనుకునిందని .. అయితే మొదటి నుంచి పద్ధతి గల ఫ్యామిలీ తమన్నా లాంటి హాట్ హీరోయిన్ ని ఆ ఇంటికి కోడలుగా యాక్సెప్ట్ చేసేందుకు రిజెక్ట్ చేసిందట . ఈ క్రమంలోనే ఆ హీరో అమ్మడికి హ్యాండ్ ఇచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు .దీంతో అప్ సెట్ అయినా తమన్న అతగాడిని దూరం పెట్టింది . ఆ తరువాత విజయ్ వర్మ ని లవ్ చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news