Movies"భోళా శంకర్" సినిమా లో కీర్తి సురేష్ పాత్రను రిజెక్ట్...

“భోళా శంకర్” సినిమా లో కీర్తి సురేష్ పాత్రను రిజెక్ట్ చేసిన .. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ ఎలా జెట్ స్పీడ్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేసి దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక మెగాస్టార్ చిరంజీవి తనలోని యంగ్ మెగాస్టార్ ను నిద్రలేపాడు. ఈ క్రమంలోనే సరికొత్త కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో మరో కొత్త అధ్యాయానికి తెరలేపాడు. ప్రసెంట్ చిరంజీవి చేస్తున్న సినిమా “భోళాశంకర్”.

మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా ఆయనకు జోడిగా నటిస్తుంది . అంతే కాదు ఈ సినిమాలో మరో హీరోయిన్ కీర్తి సురేష్ ఆయనకు చెల్లెలుగా కనిపించబోతుంది . కీర్తి సురేష్ భర్తగా యంగ్ హీరో సుశాంత్ కనిపించబోతున్నాడు . అయితే మెహర్ రమేష్ ఈ కథ అనుకున్నప్పుడు మొదటగా మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా హీరోయిన్ సాయి పల్లవి అని అనుకున్నారట. ఇదే విషయం ఆమెకు చెప్పి కథను వివరించగా.. ఆమె కథ వినకుండానే ఈ సినిమా రిజెక్ట్ చేసిందట .

రీమిక్ సినిమాలో నటించకూడదని సాయి పల్లవి ముందు నుంచే నిర్ణయం తీసుకుందట . అందుకే సాయి పల్లవి ఈ పాత్రను రిజెక్ట్ చేసింది అని లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చింది. దీంతో సాయి పల్లవి మంచి ఛాన్స్ మిస్ చేసుకునింది అంటూ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన భోళాశంకర్ ట్రైలర్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిందో తెలిసిందే. ఆగస్టు 11న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే సాయి పల్లవి మంచి అవకాశాన్ని చేతులారా వదులుకున్న మనిషి అవుతుంది అంటూ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news