NewsKGF2 రికార్డులను తుక్కు తుక్కు చేసేసిన "బేబీ".. కలలో కూడా ఎక్స్...

KGF2 రికార్డులను తుక్కు తుక్కు చేసేసిన “బేబీ”.. కలలో కూడా ఎక్స్ పెక్ట్ చేయని కలెక్షన్స్..టోటల్ ఎన్ని కోట్లు అంటే..?

బాక్సాఫీస్ వద్ద బేబీ మానియా కొనసాగుతుంది . టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమా జూలై 14న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకోవడమే కాకుండా .. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది . కాగా ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఇప్పటికే 70 కోట్లు క్రాస్ చేసేసింది ..

రీసెంట్ గానే విజయ్ దేవరకొండ కెరియర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్స్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమా రికార్డును సైతం బద్దలు కొట్టిన బేబీ సినిమా తాజాగా కన్నడ స్టార్ హీరో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కేజిఎఫ్ 2 రికార్డులను చిత్తుచిత్తు చేసేసింది . గతంలో కేజిఎఫ్ 2 వరుసగా 12 రోజులపాటు రోజుకు కోటి వసూలు సాధించి సినిమా ఇండస్ట్రీలో చెరగని రికార్డు నమోదు చేసింది.

అయితే తాజాగా ఆ చిత్ర రికార్డును బద్దలు కొట్టింది బేబీ సినిమా . ఈ చిత్రం వరుసగా 13 రోజులపాటు కోటికి పైగా వసూలు చేసి కేజిఎఫ్ రికార్డ్లను వెనక్కి నెట్టింది . ఈ చిత్రం రిలీజ్ అయి రెండు వారాలు గడుస్తున్న కలెక్షన్ పరంగా మాత్రం ఏ మాత్రం తగ్గేదే లే అన్న రేంజ్ లో దూసుకుపోతుంది . ఇది ఇలాగే కొనసాగితే 100 కోట్లు కూడా క్రాస్ చేయడం పక్క అంటున్నారు సినీ విశ్లేషకులు . చూద్దాం మరి బేబీ రానున్న రోజుల్లో మరిఎన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుందో ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news