Moviesఆ హీరో కోసం భారీ త్యాగం చేసిన బన్నీ.. ఏ స్టార్...

ఆ హీరో కోసం భారీ త్యాగం చేసిన బన్నీ.. ఏ స్టార్ చేయకూడని పని చేసి చూపించాడుగా ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజీ స్థానం.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . గంగోత్రి సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ ఆ తర్వాత బన్నీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ ని తీసుకొస్తూ సరికొత్త స్టైలిష్ వేర్ ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు. ప్రజెంట్ బన్నీ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . బన్నీ నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయి బాక్సాఫీస్ రికార్డు తిరగరాసిన విషయం మనందరికీ తెలిసిందే .

కాగ ఇలాంటి క్రమంలోనే బన్నీ ఇండస్ట్రీలో ఉండే హీరో కోసం చేసిన త్యాగం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ న్యూస్ తెలుసుకున్న అభిమానులు సైతం షాక్ అయిపోతున్నారు . బన్నీ ఇంతటి సాహసం చేశాడా.. ఇంత త్యాగం చేశాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మనకు తెలిసిందే బన్నీ ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తారు . మరీ ముఖ్యంగా ఒకరికి హెల్ప్ చేయడంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో బన్నీ అనే చెప్పాలి . అయితే అలాంటి బన్నీ మెగా హీరో సాయి ధరంతేజ్ కోసం తనకు నచ్చిన కథను సాక్రిఫైజ్ చేశారట. సాయి ధరంతేజ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద సూపర్ హిట్గా నిలిచిన మూవీ” సుప్రీమ్ ” . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు .

ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్గా నటించగా.. రాజేంద్రప్రసాద్ – కబీర్ సింగ్ -రవి కిషన్ సాయికుమార్ తదితరులు కీలకపాత్రను పోషించి ఈ సినిమా విజయానికి కారకులయ్యారు. అయితే ఈ సినిమాని మొదటగా అనిల్ రావిపూడి అనుకుంది అల్లు అర్జున్ కోసమే అంటూ తెలుస్తుంది . పటాస్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి – అల్లు అర్జున్ కోసమే కధ రాసుకున్నారట . అయితే “అల్లు అర్జున్ ఈ కథ విని ఇంప్రెస్ అయ్యి ఇది నా కన్నా సాయిధరమ్ తేజ్ కి బాగుంటుంది ..తనకి కొత్త లైఫ్ ఇచ్చినట్లు ఉంటుంది” అంటూ స్వయంగా సాయిధరమ్ తేజ్ పేరుని సజిస్ట్ చేశారట . ఈ సినిమా తర్వాత సాయి ధరంతేజ్ కెరీర్ ఏ రేంజ్ లో మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జనరల్ గా ఇండస్ట్రీలో ఇలాంటి హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు .. ఏ హిట్టు కథనైనా ముందు తామే చేయాలని అనుకుంటారు ..హీరోకి కావాల్సిన ప్రధాన లక్షణం కూడా అదే ..కానీ పక్క హీరో కూడా ఇండస్ట్రీలో ఎదగాలి అని ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకొని అభిమానులు చేత శభాష్ అనిపించుకుంటున్నాడు బన్ని..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news