Moviesబాలయ్య పాటకు మాస్ స్టెప్పులతో ఇరగదీసిన శ్రీలీల-కాజల్.. మధ్యలో అనిల్ రావిపూడి...

బాలయ్య పాటకు మాస్ స్టెప్పులతో ఇరగదీసిన శ్రీలీల-కాజల్.. మధ్యలో అనిల్ రావిపూడి ఏం చేసారో చూడండి(వీడియో)..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు అమ్మడు చేసింది రెండే రెండు సినిమాలే.. అయినప్పటికీ ఇండస్ట్రీలో వరుసగా పది సినిమాలకు కమిట్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీ లీల ప్రధాన పాత్ర పోషిస్తుంది . ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడిగా నటిస్తుంది . రీసెంట్ గా నే సెట్స్ కాజల్-అనిల్-శ్రీలీల కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని రిలీజ్ చేసింది చిత్ర బృందం.

ఈ వీడియోలో అనిల్ రావిపూడిని శ్రీ లీల – కాజల్ అగర్వాల్ ఆడేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. అనిల్ రావిపూడి బాలయ్య సాంగ్కు చిందేస్తాడు. బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య అనే సాంగ్ కి అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో చిందులేసాడు . కాగా దానికి రివేంజ్ గా అనీల్ ముందే కాజల్ -శ్రీలీల ..బాలయ్య మరో సినిమా పాటకు చిందేసి అనిల్ కు షాక్ ఇచ్చారు.

నరసింహనాయుడు చిత్రంలోని చిలకపచ్చ కోకా అనే సాంగ్ లోని రెండు లైన్లకు శ్రీ లీల కాజల్ యమహాట్ గా అదరగొట్టేశారు . “రారా ఉల్లాస వీరుడా”.. అంటూ జీన్స్ ప్యాంటు లోను చించేశారు . ఈ క్రమంలోనే అనిల్ వచ్చి సూపర్ అని చెప్పిన ఇంకా మాది అవ్వలేదు అంటూ మిగతా మ్యూజిక్ కూడా ఓ రేంజ్ లో చిందేశి అనిల్ రావిపూడి కి తమ సత్తా చూపించారు .

ఇక ఇందులో ఒక మరొక విషయం ఏమిటంటే ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే కలర్ డ్రెస్సుల్లో కనిపించి సర్ ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే బాలయ్య – శ్రీ లీల – కాజల్ ఒకే తెరపై చూస్తే మటుకు అభిమానులకు గూస్ బంప్స్ మోత మోగాల్సిందే . ఖచ్చితంగా ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసేస్తుంది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news