Moviesపబ్లిక్ గానే బోల్డ్ ప్రశ్న అడిగిన అభిమాని.. శృతి హాసన్ ఆన్సర్...

పబ్లిక్ గానే బోల్డ్ ప్రశ్న అడిగిన అభిమాని.. శృతి హాసన్ ఆన్సర్ కి అందరి నోర్లు ఖతక్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ హీరోయిన్స్ ఫాన్స్ తో ముచ్చటించడం చాలా ఎక్కువగా చూస్తున్నాం . ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే ..కనీసం వారానికి ఒక్కసారైనా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటిస్తూనే ఉంటారు . మరీ ముఖ్యంగా అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ అయితే వారానికి రెండుసార్లైనా అభిమానులతో టచ్ లో ఉంటుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాలో అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించిన శృతిహాసన్ కు తన అభిమాని నుంచి ఓ బోల్డ్ ప్రశ్న ఎదురయింది.

ఈ క్రమంలోనే శృతిహాసన్ సైతం ఏమాత్రం భయపడకుండా బెదరకుండా ఉన్నది ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేసి ..తనపై వచ్చే పుకార్లకు సైతం చెక్ పెట్టేసింది . కాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్న శృతిహాసన్ ని ఓ అభిమాని మీరు మద్యం సేవిస్తారా..? దానిపై మీ అభిప్రాయం ఏంటి ..? అంటూ బోల్డ్ గా ప్రశ్నించారు .

ఈ క్రమంలోనే శృతిహాసన్ రిప్లై ఇస్తూ “నాకు మద్యం తీసుకునే అలవాటు లేదు.. అంతేకాదు డ్రగ్స్ కూడా తీసుకోను ..నేను లైఫ్ని ఎంజాయ్ చేస్తాను.. ట్రెండీ గా ఉంటాను.. కానీ నా హద్దుల్లో ఉంటాను..” అంటూ ఎవరైతే తనపై చెత్త రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో ..వాళ్ళందరికీ పగిలిపోయే ఆన్సర్ ఇచ్చింది . ఈ ఒక్క రిప్లైతో శృతిహాసన్ ఎంత కాన్ఫిడెంట్ గల అమ్మాయి అనేది ప్రూవ్ అయిపోయింది . దీంతో సోషల్ మీడియాలో శృతిహాసన్ ఆన్సర్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news