Movies"మా నన్న చావుకి కారణం వాళ్ళే.. ఊరికే వదలను".. రాకేష్ మాస్టర్...

“మా నన్న చావుకి కారణం వాళ్ళే.. ఊరికే వదలను”.. రాకేష్ మాస్టర్ కొడుకు స్ట్రైట్ వార్నింగ్..!!

ప్రసెంట్ సినిమా ఇండస్ట్రీలో రాకేష్ మాస్టర్ మృతి ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే . సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ గా ఉన్న రాకేష్ మాస్టర్ కొన్ని రోజుల ముందే అనారోగ్య కారణంగా మృతి చెందారు. ఎండలు తీవ్రంగా ఉండడం ..ఆ ఎండలకు యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి బాగా తిరగడంతో రక్త విరోచనాలు అయ్యి ..షుగర్ లెవల్స్ పడిపోయి.. ట్రీట్మెంట్ కి సహకరించక మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యి రాకేష్ మాస్టర్ చనిపోయారు అంటూ డాక్టర్స్ అధికారికంగా ధ్రువీకరించారు.

ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ మృతిని అభిమానులు జీవించుకోలేకపోతున్నారు. అయితే పలువురు యూట్యూబ్ ఛానల్స్ మాత్రం రాకేష్ మాస్టర్ ని వాడుకున్నారని ఆయన ద్వారా పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకున్నారని తన కొడుకు చరణ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు . చరణ్ మాట్లాడుతూ..” మా నాన్న చావుకు సోషల్ మీడియానే కారణం. వాళ్ళ స్వార్థం కోసం మా నాన్నను పూర్తిగా వాడేసుకున్నారు .

మా నాన్న వల్ల ఎంతో ప్రాఫిట్స్ సంపాదించుకున్నారు. క్రేజ్ – పబ్లిసిటీ – పాపులారిటీ దక్కించుకున్నారు . అయితే మా నాన్నను మాత్రం పూర్తిగా నెగిటివ్గా చూపించారు. మీరు చేసిన హెల్ప్ చాలు ఇక దయచేసి మా నాన్న వీడియోలు ..మా కుటుంబం కు సంబంధించిన ఏ న్యూస్ లో ప్రచారం చేయొద్దు . మా కుటుంబాన్ని నవ్వులు పాలు చేయొద్దు ..ఒకవేళ మీరు అలా చేయకపోతే నేను పోలీస్ కేసు పెడతాను” అంటూ డైరెక్ట్ గా హెచ్చరించారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news