Moviesఅమ్మ బాబోయ్.. ఒక్క ముద్దు కోసం హనీ రోజ్ ఎంత రిస్క్...

అమ్మ బాబోయ్.. ఒక్క ముద్దు కోసం హనీ రోజ్ ఎంత రిస్క్ చేసిందో చూడండి..వీడియో వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా ..కొత్తగా ఎంతమంది ముద్దుగుమ్మలు వస్తున్నా..హీరోయిన్ హనీ రోజ్ కి ఉన్న స్పెషల్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే .. మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హనీ రోజ్ తెలుగులో కూడా తన సత్తా చాటుకుంది. రీసెంట్ గానే బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలో ఆయన మరదలుగా నటించి సూపర్ డూపర్ నటిగా పాపులారిటీ సంపాదించుకున్న హనీ రోజ్ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది .

కాగ ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో నిరంతరం అభిమానులతో టచ్ లో ఉంటున్న హనీ రోజ్.. రీసెంట్గా ఓ వీడియోను షేర్ చేసుకుంది . ఈ వీడియో చూసిన జనాలు అమ్మడు ఓపికకి ..సహనానికి హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు. ఐర్లాండ్ లో బ్లార్నీ అనే కోట ఉంది. అది క్రిస్టియన్స్ కి అత్యంత పవిత్రమైన ప్రదేశం. చాలా పవితంగా చూస్తు ఉంటారు జనాలు.

ఆ కోటపైన ఉన్న బ్లార్నీ స్టోన్ ని క్రిస్టియన్ లు వంగి మరీ ముద్దు పెడుతూ ఉంటారు. అలా ఆ స్టోన్ కి ముద్దు పెట్టుకుంటే వాళ్లౌ ఎంతో పవిత్రమైనది. అలా చేస్తే నేరుగా దైవంతో కనెక్ట్ అయినట్లు వారు నమ్ముతుంటారు. ఇక హనీ రోజ్ కూడా అదే నమ్ముతుంది. దీంతో ఎంతో కష్టం మీద హనీ రోజ్ పెద్ద‌ సాహసం చేసి మరీ బ్లార్నీ స్టోన్ ని ముద్దు పెట్టుకుంది. ఆ వీడియోని ఇప్పుడు సోష‌ల్ మీడియ‌ లో షేర్ చేసి అదోక అద్భుతమైన అనుభూతి అని పంచుకుంది. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news