Moviesబుక్ మై షోలో ' ఆదిపురుష్ ' బ్లాస్టింగ్ రికార్డ్‌… ఏ...

బుక్ మై షోలో ‘ ఆదిపురుష్ ‘ బ్లాస్టింగ్ రికార్డ్‌… ఏ హీరో ట‌చ్ చేసే ద‌మ్ము కూడా ఉండ‌దుగా…!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఆదిపురుష్ ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమాకు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న గ‌తంలో తానాజి సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడు. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతిస‌న‌న్ సీత‌గా, లంకేశ్ రావ‌ణుడిగా సైఫ్ ఆలీఖాన్ నటించారు.

ఈ సినిమాకు ముంబై, ఢిల్లీ మ‌ల్టీఫ్లెక్సుల‌లో రు. 2 వేల నుంచి రు. 2500 టిక్కెట్ పెట్టినా కూడా హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్నాయి. సినిమాకు ప‌ర్వాలేద‌న్న టాక్ రావ‌డంతో టిక్కెట్లు దొర‌క‌ని ప‌రిస్థితి. దీనికి తోడు బీజేపీ ప్ర‌భుత్వంతో పాటు బీజేపీ పార్టీ, హిందూత్వ సంఘాల నుంచి సినిమాకు స‌పోర్ట్ ద‌న్నుగా ద‌క్కుతోంది. దీంతో అటు రాజ‌కీయ వ‌ర్గాల్లో కూడా ఆదిపురుష్ సంచ‌ల‌నంగా మారింది.

ఇక బుక్ మై షోలో ఆదిపురుష్ దుమ్ము రేపుతోంది. అడ్వాన్స్ సేల్స్ ప‌రంగా చూస్తే అన్ని భాష‌ల్లోనూ క‌లిపి ఇప్ప‌టికే ఏకంగా 1.5 మిలియ‌న్ టిక్కెట్లు అమ్ముడుపోయాయి. దీనిని బ‌ట్టే ఈ సినిమా ప‌ట్ల టోట‌ల్ ఇండియ‌న్ సినిమా జ‌నాలు ఎంత ఆస‌క్తితో ఉన్నారో అర్థ‌మ‌వుతోంది. ఈ ఊపు చూస్తుంటే ఫైన‌ల్ ర‌న్‌లో సినిమా వసూళ్లు, అడ్వాన్స్ బుకింగ్‌లు స‌రికొత్త రికార్డుల‌తో పాట రికార్డుల చీటిలు చింపేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news