Moviesకోట్లు పారితోషకం తీసుకుంటున్న ఈ స్టార్ హీరోలు.. ఆ విషయంలో అంత...

కోట్లు పారితోషకం తీసుకుంటున్న ఈ స్టార్ హీరోలు.. ఆ విషయంలో అంత వీకా..?

జనరల్ గా మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. కొందరికి డబ్బు .. కొందరికి ఎమోషన్స్ ..కొందరికి ప్రేమ.. కొందరికి మరేదో .. ఇలా ఒక్కొక్కరికి.. ఒక్కొక్క ఎమోషన్.. ఒక్కొక్క వీక్నెస్ అనేది ఉంటుంది. జనరల్ గా తమ వీక్నెస్ ని ఏ పర్సన్ బయటకు చెప్పుకోరు. కొందరు మాత్రం ఓపన్ గా చెప్పుకునేస్తారు. అలా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు కూడా తమ వీక్నెస్ ని ఓపెన్ గా చెప్పేశారు . వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

రామ్ చరణ్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్ బాడా హీరోగా పేరు సంపాదించుకున్న చరణ్ ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుని.. ఒక్కో సినిమాకి 100 కోట్లు తీసుకుంటూ టాప్ ప్లేస్ లో ఉన్నాడు . రీసెంట్గా ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ఆస్కార్ అవార్డు అందుకొని సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన రాంచరణ్ కి కూడా వీక్నెస్ ఉంది . అదే తన ఫాదర్.. తన ఫ్యామిలీ. ఎటువంటి సిచువేషన్ లో నైన ఫ్యామిలీకి తన ఫాదర్ కి దూరంగా ఉండడానికి ఇష్టపడడట రామ్ చరణ్ . అంతే కాదు కొన్ని సినిమాల్లో షూటింగ్ టైంలో ఫారిన్ కంట్రీస్ నుంచి తండ్రి గుర్తుకొచ్చి షూటింగ్ క్యాన్సల్ చేసుకుని మరి ఇంటికి వచ్చేసాడట . అంత ప్రేమ నాన్న అంటే చరణ్ కి..

ఎన్టీఆర్ : నందమూరి నట వారసుడిగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు . రీసెంట్గా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు అందుకొని గ్లోబల్ స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న తారక్ ప్రెసెంట్ ఎన్టీఆర్ థర్టీ సినిమాలో నటిస్తున్నాడు . కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు . కాగా ఇదే క్రమంలో ఎన్టీఆర్ కి సంబంధించిన వీక్నెస్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కు తన అమ్మ అంటే ఎంతో ఇష్టమట . తన అమ్మకి సంబంధించిన ఏ విషయం అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ తలుచుకొని ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అంతేకాదు ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ తనకు బాధ వస్తే అమ్మ ఒడిలో పడుకొని రిలాక్స్ అవుతూ ఉంటాడు..

మహేష్ బాబు : టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు. ఒక్కో సినిమాకి 70 కోట్ల పారితోషకం తీసుకుంటున్న మహేష్ బాబు ..ప్రెసెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు మహేష్ . మహేష్ కి ఎవరైనా బాధలో ఉంటే చూడలేరట. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు మహేష్ బాబు వీక్నెస్ గా తెలుస్తుంది. అందుకే మహేష్ బాబు చిన్నపిల్లలకి హాట్ సర్జరీలు చేయిస్తూ ఆయనకు తగిన సహాయం చేస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా పేరు సంపాదించుకున్న ఈ హీరో మెయిన్ వీక్నెస్ అందరికీ తెలిసిందే ..సేవ.. ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమై ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కన్నా ఎక్కువగా ప్రజలకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు . నమ్మిన ప్రజలు బాధపడకూడదని ఎప్పుడు వాళ్లకి హెల్ప్ చేస్తూ ఏదో ఒక్క విధంగా ఆలోచిస్తూ ఉంటాడట పవన్ కళ్యాణ్ . అంతేకాదు పవన్ కళ్యాణ్ కి ఉన్న ఆ ఎమోషన్ ని కొందరు పిచ్చి అంటూ కూడా ఆయన ని నిందిస్తూ ఉంటారు . అయితే ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరో వైపు రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్నారు..!!ఇంకా చాలా మంది హీరోలకి కూడా చాలా విక్నెస్ లు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news