Moviesస్టార్ హీరో భార్య పై కన్నేసిన శింబు..5 కోట్లు ఇచ్చి మరి...

స్టార్ హీరో భార్య పై కన్నేసిన శింబు..5 కోట్లు ఇచ్చి మరి బుక్ చేసుకుంటున్నాడా..?

ఇన్నాళ్లు తెలుగు – తమిళ హీరోయిన్స్ తోనే రొమాన్స్ చేసిన కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బడా హీరో రన్వీర్ సింగ్ భార్య దీపిక పదుకునేపై కన్నేశాడు అంటూ కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. తమిళనాడు స్టార్ హీరోగా వెలుగు వెలిగిన శింబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమాల విషయంలో ఎంత కేర్ఫుల్ గా ఉంటాడో హీరోయిన్స్ విషయంలో అంతకన్నా కేర్ఫుల్ గా ఉంటాడు.

తాను నటించి స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతి హీరోయిన్తో రొమాంటిక్ యాంగిల్ నడిపాడు శింబు అంటూ ఓ న్యూస్ ఎప్పటినుంచో వైరల్ అవుతుంది. హన్సిక – నయనతార పేర్లు మరింత రేంజ్ లో పాపులారిటీ అందుకున్నాయి. అయితే ఈ క్రమంలోనే శింబు తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను సెలెక్ట్ చేసుకున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది .

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పొజిషన్లో ఉన్న దీపిక ప్రస్తుతం ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె శింబు తో నటించడానికి ఓకే చెప్తుందా లేదా అన్నది ప్రశ్నర్ధకంగానే ఉంది. అయితే శింబు మాత్రం తన సినిమాలో హీరోయిన్గా దీపిక పదుకొనేను పెట్టాలి అంటూ భీష్ముంచుకుని కూర్చున్నాడట. కోట్లు పారితోషకం ఆఫర్ చేస్తున్నాడట. చూడాలి మరి దీపికా అందుకు ఒపూకుంటుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news