Moviesమెగా డాటర్ నీహారిక మెడలో తాయత్తు.. ఎందుకోసం వేసుకుందో తెలిస్తే షాకే..!?

మెగా డాటర్ నీహారిక మెడలో తాయత్తు.. ఎందుకోసం వేసుకుందో తెలిస్తే షాకే..!?

ఈ మధ్యకాలంలో మెగా డాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో .. ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా .. ఆ విషయాలను ఎక్కడ నిహారిక కన్ఫర్మ్ చేయట్లేదు . అలా అని తప్పు పట్టడం లేదు . ఈ క్రమంలో నిహారిక విడాకులు తీసుకుంటుందా..? తీసుకోదా..? ఎందుకు ఆమె భర్తకు దూరంగా ఉంటుంది ..? ఎందుకు పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది..? ఆయన్ని అన్ఫాలో చేసింది ..? అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు .

ఈ క్రమంలోనే నిహారిక మాత్రం ఎక్కడ అలాంటి విషయాల గురించి ఆలోచించకుండా పట్టించుకోకుండా తన లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది. రీసెంట్ గా “డెడ్ ఫిక్సెల్స్” అనే వెబ్ సిరీస్ లో నటించిన నిహారిక మరో కొత్త ప్రాజెక్టును తెరపైకి తీసుకురాబోతుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటూ కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన నిహారిక తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది . రీసెంట్గా మదర్స్ డే సందర్భంగాకొత్త సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలను మొదలుపెట్టింది.

మదర్స్ డే కానుకగా వాళ్ళ అమ్మ గారితో ఈ పూజ కార్యక్రమాలను చేయించింది . కాగ ఈ పూజా కార్యక్రమానికి నిహారిక చాలా హైలెట్గా కనిపించింది . చాలా స్లిమ్ గా వైట్ శారీతో రెడ్ డాట్స్ తో ..రెడ్ స్లీవ్ లెస్ బ్లౌస్ తో ..సూపర్ హాట్ గా కనిపించింది . అంతేకాదు ఆక్సిడైజ్డ్ జ్యూవెలరి వేసి మెడలో తాయత్తులా ఉండే దండతో కనిపించింది . దీంతో నిహారిక ఇలాంటివి కూడా నమ్ముతాదా ..?అంటూ జనాల ఆశ్చర్యపోతున్నారు . అంతేకాదు నిహారిక హిట్ ట్రాక్ పడడానికి పూజలు చేయించుకుని తాయత్తు వేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు . ప్రెసెంట్ నిహారిక తాయత్తులా ఉన్న ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news