Movies"నా లైఫ్ గురించి ఏం తెలుసు మీకు"..ఎవ్వరికి తెలియని నిజాని బయటపెట్టిన...

“నా లైఫ్ గురించి ఏం తెలుసు మీకు”..ఎవ్వరికి తెలియని నిజాని బయటపెట్టిన సునీత..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా పేరు సంపాదించుకున్న గాయని సునీత గురించి ఎంత చెప్పినా తక్కువే . హీరోయిన్ కి మించి పోయే రేంజ్ లో అందం ఉన్న సునీత అంతకుమించిన అందంతో గాత్రంతో మంచి మంచి పాటలు పాడుతుంది . మనసుకు ఎంత బాధ కలిగినా సరే ఒక్కసారి ఆమె పాట వింటే చాలు ఆ బాధలన్నీ మనకు తెలియకుండా మాయమైపోతాయి . అంతటి స్పెషల్ వాయిస్ ఉన్న సునీత ఎన్నో వేలపాటలు పాడింది ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పింది .

సినిమా ఇండస్ట్రీ పరంగా సునీత ఎటువంటి రీమార్క్ లేకుండా స్టార్ సింగర్ పొజిషన్ అందుకున్న సునిత.. సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను ఎప్పుడు ట్రోల్ చేస్తూ ఉంటారు కొందరు ఆకతాయిలు . కాగ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింగర్ సునీత తన ప్రైవేట్ లైఫ్ పై ఓపెన్ అప్ అయింది. సోషల్ మీడియాలో ఆమెపై హ్యుజ్ రేంజ్ లో చేసే ట్రోలింగ్ గురించి ఎమోషనల్ గా స్పందించింది .

“అందరూ నా లైఫ్ గురించే మాట్లాడుకుంటున్నారు.. నా లైఫ్ లో జరిగినవి ఏవి మీకు తెలియదు.. చిన్న వయసులోనే పెళ్లయిపోయింది.. భర్త పెట్టే టార్చర్ భరించలేక విడాకులు తీసుకున్నాను . ఆ సమయంలో నా లైఫ్ని కోల్పోయాను.. నేను ఒంటరిగా ఉన్నాను అన్న ఫీలింగ్ నాకు కలిగింది. నా పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడ్డాను.. ఎన్నో బాధలను అనుభవించాను ..నా పిల్లల్ని లైఫ్ లో సెటిల్ చేయడానికి చాలా కష్టాలు పడ్డాను ..అలాంటి టైం లోనే నాకు రామ్ కలిసారు ..మంచి స్నేహితులగా మారాము.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాము ..మా పిల్లలు అంగీకారంతోనే మేము ఒకటయ్యాము..

ఇలా ఎవరు నోటికి వచ్చిన్నటు వాగడం మంచిది కాదు ..నా లైఫ్ లో పడిన ప్రాబ్లమ్స్ ఎవరికీ తెలియవు ..అలాంటివాళ్లు ఏమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు “అంటూ సునీత తనదైన స్టైల్ లో రియాక్ట్ అయింది. ఏది ఏమైనా సరే సునీత లైఫ్ గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొందరు పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు ..అలాంటి వాళ్లు తమకు ఓ లైఫ్ ఉంది అన్న విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news