Moviesప్రేమ‌లో ప‌డి ఫెయిల్ అయిన‌ `చ‌లం` ఎన్టీఆర్‌కు ఇచ్చిన షాకింగ్‌...

ప్రేమ‌లో ప‌డి ఫెయిల్ అయిన‌ `చ‌లం` ఎన్టీఆర్‌కు ఇచ్చిన షాకింగ్‌ స‌ల‌హా ఇదే… !

మ‌హా ర‌చ‌యిత‌.. చ‌లం.. నేటి త‌రానికి తెలియ‌క పోవ‌చ్చు. కానీ, 1970-90ల మ‌ధ్య తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంత‌లు తొక్కించి.. ప్రేమికుల మ‌న‌సు దోచుకున్న మ‌హా ర‌చ‌యిత‌గా .. రెండు ద‌శాబ్దాల‌పాటు ఆయ‌న తెలుగు నేల‌పై త‌న చిర‌స్థాయి ముద్ర వేసుకున్నారు. చ‌లం అస‌లు పేరు గుడిపాటి వెంక‌టాచ‌లం. కుటుంబం మొత్తం శ్రోత్రియ‌బ్రాహ్మ‌ణ కుటుంబ‌మే. నిత్య సంధ్య‌వంద‌నాది క్ర‌తువులు చేసేవారు.

అయితే.. చ‌లానికి క‌మ్యూనిస్టు భావాలు అబ్బాయి. దీంతో తాను ఆయా సంప్ర‌దాయాల‌కు దూరంగానే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అభ్యుదయ సాహిత్యం వైపు మ‌ళ్లారు. ఇక‌, శ్రీశ్రీ దూకుడు ఒక‌వైపు.. చ‌లం చుర‌క‌లు మ‌రోవైపు.. ఇలా.. ఆ రెండు ద‌శాబ్దాల్లో ర‌చ‌యిత కాలం ప‌రిఢ‌విల్లింద‌నే చెప్పాలి. ఇంకో వైపు.. విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ శాస్త్రి, సి. నారాయ‌ణ‌రెడ్డి ఇలా.. ఎంతో మంది ఆ రెండు ద‌శాబ్దాల‌ను త‌మ క‌లాల‌తో పునీతం చేశారు.

ఇదిలావుంటే.. చ‌లం.. త‌న జీవితంలో ప్రేమ విష‌యంలో భ‌గ్న‌మ‌య్యార‌నేది అప్ప‌ట్లో టాక్ న‌డిచింది. దీనిని ఆయ‌న పుస్త‌కాల్లోనూ చొప్పించారు. ప్రేమ విష‌యంలో ఆయ‌న ఎంత ప‌రిణితి చెందారో.. ప్రేమ లేఖ‌లు న‌వ‌ల్లో మ‌న‌కు స్ప‌ష్టంగా తెలుస్తుంది. అయితే.. చివ‌రికి ఆయ‌న వైరాగ్యంలో మునిగిపోయారు. ఎంత సేపూ..ఈ సంసారం.. ఈ బాధ‌ర బందీ ఎందుక‌నుకున్న ఆయ‌న‌.. అరుణాచ‌లం చేరిపోయి.. ర‌మ‌ణ మ‌హ‌ర్షి ఆశ్ర‌మంలో చేరిపోయారు.

ఇదే విష‌యాన్ని చ‌లం.. అన్న‌గారు ఎన్టీఆర్‌కు లేఖ రూపంలో రాశారు. మీరూ వ‌చ్చేయండి.. చేయాల్సింది చేశారు చాలు.. ఇక‌, ప్ర‌శాంతంగా ఉందాం.. వ‌చ్చేయాల‌ని సూచించారు. ఆ స‌మ‌యంలో అన్న‌గారు.. ఏపీలో పార్టీ పెట్టారు. చ‌లం రాసిన లేఖ‌ను కూడా ఆయ‌న చ‌ద‌వ‌లేద‌ని.. ల‌క్ష్మీపార్వ‌తి ఓ సంద‌ర్భంలో చెప్ప‌డం గ‌మ‌నార్హం. రామారావు రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక‌.. చాలా మంది స్నేహితుల‌ను వ‌దులుకున్నారు. వారిలో చ‌లం కూడా ఒక‌ర‌ని ఆమె చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news