Moviesహన్సిక ఫేస్ కి అంత సీన్ ఉందా..? కమిట్మెంట్ అడిగే ముఖమేనా...

హన్సిక ఫేస్ కి అంత సీన్ ఉందా..? కమిట్మెంట్ అడిగే ముఖమేనా అది..?

టాలీవుడ్ ఆపిల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న హన్సిక మోత్వాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. అందానికి అందం.. నటనకి నటన ..అభినయానికి అభినయం అన్ని కలగలిసిన ఓ హాట్ బ్యూటీ అనే చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది . తెలుగు చలనచిత్ర పరిశ్రమలో “దేశముదురు” అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక. ఆ తర్వాత అమ్మడు క్రేజ్ ఏ రేంజ్ లో మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గానే పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిలైపోయిన హన్సిక .. రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది .

సినిమా ఇండస్ట్రీలో నేను క్యాస్టింగ్ ఎదుర్కొన్నాను అంటూ బిగ్ బాంబు పేల్చింది. అంతేనా తెలుగు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో నన్ను కమిట్మెంట్ అడిగారు అని ఓపెన్ గా చెప్పుకొచ్చింది . హన్సిక మాట్లాడుతూ..” నేను ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను. ఓ తెలుగు హీరో నన్ను ఏకంగా కమిట్మెంట్ అడిగారు . నైట్ కి రమ్మన్నాడు ..ఇప్పుడు ఆయన సౌత్ లోనే ఓ స్టార్ హీరోగా ఉన్నారు. ఆయన అలా అడుగుతారని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పైకి చాలా మంచి వ్యక్తిగా కనిపించారు ..నేను అలాంటి దాన్ని కాదు అంటూ తగ్గేసి చెప్పాను . ఆయన నుంచి తప్పించుకొని ఎన్నో సినిమాలు చేశాను.. ఆ తర్వాత ఆయన నన్ను అర్థం చేసుకొని సారీ తప్పుగా అడిగాను అంటూ క్షమించమని అడిగారు . ఇప్పుడు అతను నాతో మంచి ఫ్రెండ్ లా ఉంటున్నాడు” అంటూ హన్సిక చెప్పుకొచ్చింది.

అయితే హన్సిక మాట్లాడిన మాటలు తెలుగు జనాలు ట్రోల్ చేస్తున్నారు. నీ ఫేస్ కి తెలుగు హీరో కమిట్మెంట్ అడిగారా..? అంత వాల్యూ ఉందనుకుంటున్నావా నువ్వు..? తెలుగులో తమరు చేసిందే అయిదుగురు లేదా ఆరుగురు హీరోలతో.. ఆ హీరోలు చాలా మంచి వ్యక్తులు . ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లు. భార్య పిల్లలతో లక్షణంగా బతుకుతున్నారు . మరి అలాంటి వాళ్ళు నిన్ను కమిట్మెంట్ అడిగారా..? ఇలాంటి తప్పుడు కామెంట్స్ చేసి ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకుందాం అనుకుంటున్నావా..? అంటూ ఏకీపారేస్తున్నారు . ఏ మాటకు ఆ మాట హన్సిక ఇండస్ట్రీలో చేసింది పట్టుమంటే పది మంది కూడా లేరు. అయితే ఈ ఆరుగురు టాలీవుడ్ హీరోలు ఇండస్ట్రీలో చాలా మంచి స్థానంలో ఉన్నా.రు వాళ్ళకి అలాంటి కర్మ అవసరం లేదు . దీనిబట్టి హన్సిక అబద్ధం చెప్పినట్టే కదా.. దీంతో హన్సిక మాటలు అబద్ధం అంటున్నారు జనాలు . అసలు నిజానిజాలు ఆ దేవుడికి తెలియాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news