Moviesఅబ్బబ్బా.. ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి .. ఎన్టీఆర్ అభిమానులకు పండగ చేసుకునే న్యూస్.....

అబ్బబ్బా.. ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి .. ఎన్టీఆర్ అభిమానులకు పండగ చేసుకునే న్యూస్.. కాలర్ ఎగరేయండి రా అబ్బాయిలు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ హీరోగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని అభిమానులకి ఫుల్ హ్యాపీనెస్ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే తారక్ కి సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ మల్టీ టాలెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కేవలం నటన పరంగానే కాదు హోస్టింగ్ లోను తన హవ్వా చూపించి అందరిని ఫిదా చేశారు .

మొదటగా బిగ్ బాస్ సీజన్ వన్ కి హోస్ట్ చేసి తనదైన స్టైల్ లో మెప్పించిన తారక్ ..ఆ తర్వాత జెమినీలో వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోలో వ్యాఖ్యాతగా చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు . కాగా ప్రజెంట్ కొరటాల సినిమా షూటీంగ్ లో బిజీగా ఉన్న తారక్ మరోసారి హోస్ట్ గా చేయడానికి రెడీ అవుతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు వరుసగా టాక్ షోలు చేస్తూ అలరిస్తున్నారు .

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కూడా హోస్టుగా చేయడానికి రెడీ అయ్యారట . ఈటీవీలో సరికొత్తగా ఎన్టీఆర్ ని మరోసారి హోస్టుగా చూపించడానికి కొత్తగా టాక్ షో ని డిజైన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 30వ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు . ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ టాక్ షోలో హోస్టుగా చేయనున్నాడు తారక్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం చివరిలో ఈ టాక్ షో షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అంతేకాదు ఈ టాక్ షో కోసం ఎన్టీఆర్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ని కూడా పుచ్చుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఏది ఏమైనా సరే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న తారక్ హోస్ట్ గా చేస్తున్నాడు అంటే నిజంగా గ్రేట్..అది అభిమానుల కోసమని చెప్పాలి . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news