Moviesసినీ చరిత్ర లోనే ఫస్ట్ టైం ..రవితేజ కోసం ఐదుగురు స్టార్...

సినీ చరిత్ర లోనే ఫస్ట్ టైం ..రవితేజ కోసం ఐదుగురు స్టార్ హీరోలు.. దీనమ్మ ఈసారి బాక్స్ బద్ధలవాల్సిందే..!!

టాలీవుడ్ మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఆయన లాస్ట్ గా నటించిన రావణాసుర సినిమా ఏ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతకుముందు నటించిన “వాల్తేరు వీరయ్య”.. అంతకుముందు నటించిన ధమాకా సినిమాలతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు రవితేజ. ఈ టైగర్ సినిమాతో కూడా 100 కోట్ల club కి చేరిపోతాడు అన్న ఆశలు పెట్టుకొని ఉన్నారు రవితేజ ఫాన్స్ .

స్టూవర్ట్ పురంగజదొంగ నాగేశ్వరావ్ లైఫ్ జర్నీ ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతోంది. ఇక రీసెంట్ గా ఈమూవీ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ను చకచకా స్టార్ట్ చేశారు. ఇక ఈమూవీ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. కాగా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంతేకాదు ఈ సినిమాకి తగ్గిన రేంజ్ లో ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేయబోతున్నారు . త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని ఐదు భాషల్లో ఒక్కొక్క స్టార్ హీరో చేత వాయిస్ ఓవర్ ఇప్పించనున్నారు మూవీ టీం.

రవితేజ పాత్రను పరిచయం చేయడం కోసం ప్రతి భాష నుంచి ఒక్కో స్టార్ రంగంలోకి దిగిబోతున్నారు . హీరో పాత్రను పరిచయం చేయడానికి మళయాలంలో దుల్కర్ సల్మాన్ .. కన్నడలో శివరాజ్ కుమార్.. తమ వాయిస్లను అందజేస్తున్నారు . అంతేకాదు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ఈ భాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు రీసెంట్గా తమిళంలో హీరో కార్తీ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు అఫీషియల్ గా ట్విట్టర్ ద్వారా కన్ఫామ్ చేసింది చిత్ర బృందం . అయితే తెలుగులో వాయిస్ ఓవర్ ఎవరిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇలా హీరో కోసం ఐదుగురు హీరోలు సపోర్ట్ చేస్తూ ఉండడం అభిమానులకి కొత్త ఫ్రెష్ ఫీలింగ్ ని కలగజేస్తుంది . చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..? రవితేజ ఫ్యాన్స్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాల్సిందే ఈసారి అంటూ
భీష్మించుకుని కూర్చున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news