Moviesఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా..కేవలం సావిత్రినే ఎన్టీఆర్ అలా పిలిచేవాడు...

ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా..కేవలం సావిత్రినే ఎన్టీఆర్ అలా పిలిచేవాడు .. ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారు రోజుకు హీరో పుట్టుకొస్తున్న ఇండస్ట్రీలో కొందరు హీరోలు పేర్లు చెప్తే మాత్రం జనాల కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు వచ్చేస్తాయి. అలాంటి ఓ ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకుంటారు కొందరు హీరోలు . ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు . అన్నగారు అని జనాలు ముద్దుగు గా పిలుచుకునే ఈ పేరు కి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో రాణించి ప్రత్యేక ముద్రను వేయించుకున్న నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పేంత అర్హత ఎవరికీ లేదు అనడంలో సందేహం కాదు..!!

నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్ టీఆర్.. సినిమా ఇండస్ట్రీకి ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లను అందించాడు. నందమూరి తారక రామారావు గారికి హీరోయిన్ సావిత్రి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి . మరి ముఖ్యంగా వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన గుండమ్మ కథ, మిస్సమ్మ, పాండవ వనవాసం , అప్పుచేసి పప్పుకూడు .. ఇలా సూపర్ హిట్ సినిమాలు .. తమ ఖాతాలో వేసుకుని క్రేజీ కాంబో గా పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ ఎంతమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయన ఫేవరెట్ మాత్రం ఎప్పుడు సావిత్రినే అట . అంత చక్కగా నటిస్తుంది ..అంత పద్ధతిగా ఉంటుంది అంటూ ఆయన ఎప్పుడు పొగిడేసేవారట .

మరీ ముఖ్యంగా ఆయన ఎంతోమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న కేవలం సావిత్రి గారిని మాత్రమే ఓ చెల్లెలా.. ఓ అమ్మలా భావించి.. సావిత్రమ్మ అంటూ ప్రేమగా పిలిచేవారట. అంతేకాదు ఎప్పుడైనా క్యారియర్ బాక్స్ పట్టుకొచ్చిన “..ఏం సావిత్రమ్మ.. నాకోసం ఏం చేసుకోచ్చావ్ ఏంటి..?” అంటూ చాలా క్లోజ్ గా అడిగేవారట . అంతేనా సావిత్రమ్మ గారు కూడా ఆయనను అన్నలా భావించి అలాగే నడుచుకునేది అంటూ అప్పట్లో జనాలు చెప్పుకొచ్చారు . ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో ఎన్టీఆర్ – సావిత్రిల రిలేషన్షిప్ మాదిరి ఏ హీరో హీరోయిన్ మెయింటైన్ చేయలేదు అన్నది మాత్రం వాస్తవం . కాగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news