Moviesబాలయ్యను హర్ట్ చేసిన శ్రీలీల..ఒక్క మాటతో కొట్టకనే బుద్దొచ్చేలా చేసాడుగా..!!

బాలయ్యను హర్ట్ చేసిన శ్రీలీల..ఒక్క మాటతో కొట్టకనే బుద్దొచ్చేలా చేసాడుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన పేరు చెప్తేనే కాదు ..ఆయన పేరుని పోస్టర్ పై చూసిన సరే నందమూరి అభిమానులకు పూనకాళ్లు వచ్చేస్తాయి. అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బాలయ్యను చూడగానే అందరికీ చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. అంతేకాదు ఎవరికైనా సరే అన్నా అని పిలవాలి అని ..మన ఇంటికి పెద్దదిక్కులా ఉన్నాడు అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . అయితే అలాంటి బాలయ్యను చూసి ఏకంగా షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకోబోయింది శ్రీ లీల .

దీంతో ఒక్కసారిగా ఫైర్ అయిపోయాడు బాలయ్య.. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయిపోతుంది. మనకు తెలిసిందే శ్రీలీ..ల బాలయ్య 108 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్య – శ్రీలీల స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది అంటూ కూడా తెలుస్తుంది . ఈ క్రమంలోని రీసెంట్గా షూట్లో పాల్గొన్న శ్రీలీల లేటుగా రావడమే కాకుండా వచ్చిన తర్వాత హెడ్ వెయిట్ గా బిహేవ్ చేసిందట.

అనిల్ కి సైతం నాటి చేష్టలతో విసుగు తెప్పించిందట . అంతేనా బాలయ్య అక్కడ ఉండగానే ఏకంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోడమే కాకుండా ..బాలయ్యకు నమస్తే పెట్టకుండా..” హాయ్ సార్ అంటూ హగ్ ఇవ్వబోయిందట”. ఈ క్రమంలోనే బాలయ్య ఒక్క ఉరుము ఉరమగానే దెబ్బకు పాపకు మ్యాటర్ అర్థమయిపోయిందట. అంతేకాదు” షూట్ కి ఇంత లేటుగా రావడం వల్ల నీ వల్ల ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా” అంటూ కూడా బాలయ్య ఫైర్ అయ్యారట . ఈ క్రమంలోనే బాలయ్య కోపానికి శ్రీలీల బలైపోయింది అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు.

అంతేకాదు కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నప్పుడు కూడా శ్రీలీల ఇలాగే బిహేవ్ చేసిందట . షూట్ కి లేటుగా రావడం పద్ధతి లేకుండా బిహేవ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటుందట . ఈ క్రమంలోనే బాలయ్య సైతం అమ్మడుకు క్లాస్ పీకారట. ” పెద్ద పెద్ద రెమ్యూనరేషన్ లు తీసుకుంటే స్టార్ హీరోయిన్ లు అయిపోరు అమ్మ ..పద్ధతి – గౌరవం – మర్యాద ఉండాలి ” అంటూ చెప్పుకొచ్చారట . ఈ క్రమంలోనే శ్రీలీలను కొట్టకనే బుద్ధి వచ్చేలా చేసేసాడు బాలయ్య గ్రేట్ అంటూ నందమూరి ఫాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news