Moviesరష్మిక-నిధి కంప్లీటెడ్..నెక్స్ట్ వేణు స్వామీ లిస్ట్ లో ఉన్న హీరోయిన్ ఈమె..!?

రష్మిక-నిధి కంప్లీటెడ్..నెక్స్ట్ వేణు స్వామీ లిస్ట్ లో ఉన్న హీరోయిన్ ఈమె..!?

సోషల్ మీడియాలో వేణు స్వామి పేరు ఏ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టార్ లైఫ్ లో జరగబోయే విషయాలను ముందే మీడియాకి లీక్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్న వేణు స్వామి ..చెప్పింది చెప్పినట్లు తూ చా తప్పకుండా జరిగిపోతూ ఉంటుంది . దానికి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి . మరి కొన్ని కూడా రాబోతున్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు ఆయన అభిమానులు .

ఈ క్రమంలోనే వేణు స్వామి చెప్పిన మాటలను మన టాలీవుడ్ హీరోయిన్స్ కూడా నమ్మి ప్రత్యేకంగా పూజలు చేయించుకోవడం సంచలనంగా మారింది. ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .. స్టార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ వేణు స్వామిని ఇంటికి పిలిపించుకొని మరి పూజలు చేసిన పిక్స్ వైరల్ అయ్యాయి . కాగా రీసెంట్ గా అదే లిస్ట్ లోకి యాడ్ అవ్వబోతుంది మరో స్టార్ బ్యూటీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఆ బ్యూ ఎవరో కాదు కన్నడ ముద్దుగుమ్మ కృటిశెట్టి. ఇదే న్యూస్ ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది . కృతి శెట్టి పొజీషన్ ఎలా ఉందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కృటిశెట్టి అమ్మగారు వేణు స్వామిని నమ్ముకున్నారట. తన కూతురు స్టార్ హీరోయిన్గా మారాలి అని..

మళ్ళీ పునర్ వైభవం రావాలి అంటూ ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నారట . దీంతో రష్మిక, నిధి తర్వాత నెక్స్ట్ టార్గెట్ కృతిశెట్టి అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు దీనికి సంబంధించిన పూజ జరిగేటప్పుడు కేవలం తన ఫ్యామిలీ మెంబర్స్ లోపల ఉండాలని కండిషన్ పెట్టి మరి పూజలు చేస్తున్నారట. చూడాలి కృతి శెట్టి అమ్మగారి పూజలు ఏమాత్రం ఫలిస్తాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news