Moviesఆ హీరోయిన్‌తో షూటింగ్‌లోనే మిస్ బిహేవ్ చేసిన అక్కినేని అఖిల్‌... న‌టి...

ఆ హీరోయిన్‌తో షూటింగ్‌లోనే మిస్ బిహేవ్ చేసిన అక్కినేని అఖిల్‌… న‌టి సీరియ‌స్ వార్నింగ్‌..

బాలీవుడ్ హీరోయిన్ ఊర్వసి రౌతేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్లో హాట్ హాట్ గా అందాలు చూపించడంలో ఆమెకు ఆమె సాటి అన్నట్టుగా ఉంటుంది. తెలుగులో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అనే ఐటమ్ సాంగ్ లో తన అందచందాలు చూపించడంతో పాటు.. నడుము వంపులతో మ‌తులు పోగొట్టేసింది.

అయితే ఊర్వశిని అక్కినేని హీరో అఖిల్ సినిమా షూటింగ్లో వేధించడంతోపాటు చాలా మిస్ బిహేవ్ చేసినట్టు బయటకు వచ్చిన ఒక ఫేక్ మెసేజ్ ఇప్పుడు సంచలనంగా మారింది. తనకు తాను దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్‌గా చెప్పుకునే వివాదాస్పద సినీ క్రిటిక్ ఉమైర్ సంధు గత కొద్దిరోజులుగా బాలీవుడ్ సినిమా సెలబ్రిటీలపై చాలా నీచమైన కామెంట్లు చేస్తూ శునకానందం పొందుతున్నాడు.

కొద్ది రోజుల క్రితం సీనియ‌ర్ హాట్ న‌టి సెలీనా జైట్లీ తండ్రి కొడుకులు ఫిరోజ్ ఖాన్, ఫ‌ర్దీన్‌ఖాన్‌తో పడుకుందని ఘాటు కామెంట్లు చేసి ఆమె నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ షూటింగ్లో ఊర్వసి రౌతేలాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన బాలీవుడ్ భామ ఊర్వ‌శి ఇది ఫేక్ అంటూ కొట్టి పడేసింది.

అంతటితో ఆగకుండా అత‌డిపై తీవ్ర విమర్శలు చేసింది. నువ్వు అసలు జర్నలిస్టు కాదని చురకలు అంటించడంతోపాటు ఇలాంటి ఫేక్ వార్తలు తమ కుటుంబానికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news