Moviesఎన్టీఆర్ నిజ‌మైన గ్లోబ‌ల్ స్టార్‌… ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా…!

ఎన్టీఆర్ నిజ‌మైన గ్లోబ‌ల్ స్టార్‌… ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా…!

త్రిబుల్ ఆర్ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావ‌డంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అలాగే ఈ పాటలో డ్యాన్స్ చేసిన ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరికీ జాతీయ స్థాయిలో కాదు.. అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రేజ్ వ‌చ్చింది.

ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ సినిమాలు ఇప్పటికే విదేశాల్లో కూడా సంచలన రికార్డులు క్రియేట్ చేశాయి. ఎన్టీఆర్‌కు జపాన్, చైనా లాంటి దేశాల్లో విపరీతంగా అభిమానులు ఉన్నారు. అలాగే విదేశాల్లో ఉన్న లక్షలాదిమంది తెలుగు సినిమా ప్రేమికులు కూడా ఎన్టీఆర్‌ను బాగా ఆరాధిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ సినిమాలకు అక్కడ బ్రహ్మారథం పడుతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్‌కు హాలీవుడ్ రేంజ్ లో కూడా క్రేజ్‌ పెరుగుతుంది.

పలువురు హాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్స్ ఎన్నో సందర్భాలలో ఎన్టీఆర్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి ఉన్నట్లు చెప్పారు. తాజాగా ఎన్టీఆర్ గురించి హాలీవుడ్ ఫేమస్ దర్శకుడు జేమ్స్ గన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే సంచ‌ల‌నంగా మారాయి. జేమ్స్ గన్ ఇటీవల గార్డియన్స్ ఆఫ్ ది గెలక్సీ సినిమా తెర‌కెక్కించ‌గా ఇది త్వ‌ర‌లోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది.

హాలీవుడ్ లో జేమ్స్ గన్ సినిమాలకు మంచి పాపులారిటీ ఉంది. అలాంటి ద‌ర్శ‌కుడు ఇప్పుడు ఇండియా నుంచి గార్డియన్స్ యూనివర్స్ గా ఎవరినైనా పరిచయం చేస్తార‌న్న ప్ర‌శ్న‌కు ఎన్టీఆర్ అని చెప్పాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో అడ‌వి మృగాల‌తో జంప్ చేసిన హీరో అని ఎన్టీఆర్ గురించి ప్ర‌స్తావించాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తో ఎన్టీఆర్‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా వ‌చ్చిన క్రేజ్‌కు ఇది ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం.

నిజంగా ఒక‌టి రెండు హాలీవుడ్ సినిమాలు ప‌డితే ఎన్టీఆర్ గ్లోబ‌ల్ స్టార్ అయ్యే ఛాన్సులు పుష్క‌లంగా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండ‌గా.. ఆ సినిమా త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉంటుంది. ఈ రెండూ పాన్ ఇండియా సినిమాలే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news