Newsకోట్లాది మంది జనాలను మెప్పించిన ..పోన్నియన్ సెల్వన్ 2 సినిమాలో నటించిన...

కోట్లాది మంది జనాలను మెప్పించిన ..పోన్నియన్ సెల్వన్ 2 సినిమాలో నటించిన ఈ అందమైన అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

మల్టీ టాలెంటెడ్ మణిరత్నం రీసెంట్ గా డైరెక్ట్ చేసి తెరకెక్కించిన సినిమా “పోనియన్ సెల్వన్ 2”. గత ఏడాది పోనియన్ సెల్వన్ 1 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న మణిరత్నం ఈ సినిమా తో కూడా మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . అంతేకాదు తాను అనుకున్న కథను జనాలకి చెప్పడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు . మరీ ముఖ్యంగా సినిమాలో హీరోయిన్స్ అందం విషయంలో చాలా కేర్ఫుల్ గా స్టెప్ వేసే మణిరత్నం సినిమాలో నటించిన ప్రతి బ్యూటీని ఆకర్షణీయంగా చూపించాడు. మరి ముఖ్యంగా ఈ సినిమాలో విక్రమ్ – కార్తీ – జయం రవి ప్రధాన పాత్రలు పోషించడం సినిమాకే హైలెట్గా మారింది .

అంతేకాదు త్రిష – ఐశ్వర్యరాయ్ – ఐశ్వర్య లక్ష్మి – శోభిత ధూళిపాల అందాలు ఈ సినిమాకి మరింత ప్లేస్ గా మారాయి . కాగా ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి క్యారెక్టర్ లో చేసిన అందాల ముద్దుగుమ్మ గురించి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ నందిని పాత్ర ఎంత కీలకమో ప్రతి ఒక్కరికి తెలిసిందే . ఆమె బాల్యం కూడా సినిమాకి ఎంతో ముఖ్యమైన పార్ట్ అని చెప్పాలి . ఈ సినిమాలో నందిని పాత్రలో బాల్యంలో నటించిన అమ్మాయి ఎవరా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . ఈ క్రమంలోనే అమ్మాయిని సెలక్ట్ చేయడానికి మణీరత్నం నానా తంతాలు పడ్డాడు అని తెలుస్తుంది .

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా ..ఆమె పేరు సారా అర్జున్ . ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా . అదేనండి విక్రమ్ నాన్న సినిమాలో విక్రమ్ కూతురుగా నటించిన చిన్న పిల్ల . ఎస్ ఆ పాపే ఇప్పుడు ఈ సినిమాలో పెద్ద పాపగా నటించింది . నాన్న సినిమా వచ్చి 12 ఏళ్లు అయిపోయింది . ఆ అమ్మాయి తర్వాత పెద్దగా సినిమాలో నటించలేదు . కానీ మణిరత్నం ఈ పాత్రకు ఆమె బాగుంటుంది అంటూ స్పెషల్ రిక్వెస్ట్ మీద తీసుకున్నారట . ఏది ఏమైనా సరే మంచి క్యారెక్టర్ లో మంచి రోల్ లో మెరిసిన సారా అర్జున్ త్వరలోనే మరిన్ని మంచి అవకాశాలు అందుకొని హీరోయిన్గా సెటిల్ అవ్వాలి అని కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news