Newsమహేశ్ ఆ బ్యూటీ పై మోజు పడుతున్నాడా..? కాల్ చేసి మరి...

మహేశ్ ఆ బ్యూటీ పై మోజు పడుతున్నాడా..? కాల్ చేసి మరి అలా అడిగాడా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే సెట్ అవుతూ ఉంటాయి . రేర్ గా సెట్ అయినా సరే ఆ కాంబో జనాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు . ఇండస్ట్రీలో ఎన్నో కాంబోస్ అలా సెట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి . సినిమా ఇండస్ట్రీలో ఒక కథను రాసుకున్నప్పుడు హీరో అనుకుంటాం .. ఆ తర్వాత ఆ హీరో ప్లేసులో మరో హీరో నటించాల్సి ఉంటుంది . అంతే కాదు హీరోయిన్ విషయంలో కూడా ఇలా చాలా జరిగాయి . కాగా మరోసారి అలా అనుకోని విధంగా ఓ కాంబో సెట్ అవ్వబోతుందట.

ఇండస్ట్రీలో క్రేజీ కాంబోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా మరోసారి తెరపై కనిపించబోతున్నారు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే మహేష్ బాబు కీర్తి సురేష్ “సర్కారి వారి పాట” సినిమాలో కలిసి నటించారు . తెర పై వీళ్ల రొమాన్స్ ఎంత బాగా పండిందో అందరికీ తెలిసిందే . బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఇద్దరికీ గుర్తుండొపోయింది ఈ సినిమా .

కాగా ఇప్పుడు మాటల మంత్రకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మళ్లీ వీళ్లని కలపబోతున్నాడట. మహేష్ బాబు ఆయన డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్లు సెట్ అయిపోయారు . శ్రీ లీల – పూజా హెగ్డే . అయితే సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉందని కేవలం 10 నిమిషాల పాత్ర కోసమే ఈ పాత్రను డిజైన్ చేశారని ..ఈ పాత్రకు కీర్తి సురేష్ యాప్ట్ గా సెట్ అవుతుంది అంటూ త్రివిక్రమ్ చెప్పుకొస్తున్నారు.

త్రివిక్రమ్ కథను వివరించగా కీర్తి సురేష్ 10 నిమిషాలు పాత్ర అనగానే ఈ కథను రిజెక్ట్ చేసిందట . అయితే మహేష్ బాబు స్వయంగా కాల్ చేసి అడగడంతో కీర్తి సురేష్ ఆయన కోసం ఈ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తుంది .మహేష్ బాబు ఇలా హీరోయిన్స్ రిజెక్ట్ చేస్తే మరోసారి కాల్ చేసి అడగడు. కానీ కీర్తి సురేష్ ని మాత్రం కాల్ చేసి అడిగారంటే ఆమె నటనకు మహేష్ కూడా ఫిదా అయ్యాడు అనేగా అంటున్నారు కీర్తి ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news