Moviesహీరో నిఖిల్ తన భార్య కి అలా ప్రపోజ్ చేసాడా..? వెరీ...

హీరో నిఖిల్ తన భార్య కి అలా ప్రపోజ్ చేసాడా..? వెరీ రొమాంటిక్ ఫెలో..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా .. యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న నిఖిల్ పేరు చెప్తే వచ్చే రెస్పాన్స్ .. అరుపులు వేరేలా ఉంటాయి . మరి ముఖ్యంగా హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిఖిల్ .. ఆ తర్వాత తన పేరుని పాన్ ఇండియా లెవెల్లో పబ్లిసిటీ చేసుకుని ప్రజెంట్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు . రీసెంట్ గానే కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవల్ లో పబ్లిసిటీ తెచ్చుకున్న ఈ హీరో.. రీసెంట్గా తన భార్యతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే హీరో నిఖిల్ తన ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అని బయట పెట్టాడు . కాగా తన భార్య పల్లవికి ప్రపోజ్ చేయడానికి ఏకంగా గోవాలో పెద్ద స్కెచ్ వేశాడట. ఓ రోజు సడన్గా చెప్పకుండా పల్లవిని గోవాకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యారట . ఈ క్రమంలోని ఫ్లైట్ దిగేలోపు ఫ్రెండ్స్ ని మొత్తం ప్రపోజ్ చేయడానికి మేనేజ్ చేయమని .. ప్రపోజ్ చేయడానికి కావాల్సిన థింగ్స్ ఏర్పాటు చేయమని చెప్పారట .

సిన్ కట్ చేస్తే నిఖిల్ – పల్లవి గోవాలో దిగేలోపే పెద్ద వర్షం.. ఎంతలా అంటే వీళ్ళ కోసం వేసిన టెంట్ కూడా ఎగిరిపోయింది . అయినా సరే ఎలాగైనా పల్లవికి ప్రపోజ్ చేయాలని అక్కడే పెద్ద కొండపై మోకాళ్లపై కూర్చోని మరీ ప్రపోజ్ చేశాడట . అయితే ఈ విషయం తెలియని పల్లవి ..చెప్పుంటే మంచి డ్రెస్ వేసుకొని వచ్చేదానిగా.. అంటూ ఫన్నీగా కామెంట్స్ చేసిందట.

దీనికి కౌంటర్ గా నిఖిల్ “నో ప్రాబ్లం నీకు ప్రపోజ్ చేయాలని ఉత్సాహంతో నేను రోడ్డు పక్కన ఉండే 50 రూపాయల చిన్న చెడ్డిని కొనుక్కొని వచ్చాను “అంటూ ఫన్నీగా చెప్పారట. ఆరోజు పల్లవి నిఖిల్ ప్రేమని.. యాక్సెప్ట్ చేయడంతో .. కొన్నాళ్ల తర్వాత వీళ్ళ పెళ్లి జరిగింది. ఇప్పుడు వీళ్లు లైఫ్ మొత్తం హ్యాపీ గా ఉంటున్నారు. కాగా హీరో నిఖిల్ తన పెళ్లిని కరోనా టైం లో చాలా సింపుల్గా చేసుకున్నారు . ప్రజెంట్ తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ క్రేజ్ సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకుంటున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news