Moviesవెంట్రుకలు కాదు దాని గురించి మాట్లాడాలి..ఆ మ్యాటర్ చెప్పితే సమంత తల...

వెంట్రుకలు కాదు దాని గురించి మాట్లాడాలి..ఆ మ్యాటర్ చెప్పితే సమంత తల ఎక్కడ పెట్టుకుంది..? చిట్టిబాబు సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, సీనియర్ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మధ్య మొదలైన వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ముందుగా సమంతపై చిట్టిబాబు కామెంట్ చేయడం.. ఆ తర్వాత సమంత చిట్టిబాబు చెవిలో ఉన్న వెంట్రుకల గురించి కౌంటర్ వేయటం.. ఇప్పుడు చిట్టిబాబు తిరిగి సమంత కౌంటర్ పై ఎన్‌కౌంటర్ వేయ‌డం జరిగింది. తాజాగా సమంత గురించి మరోసారి మాట్లాడిన చిట్టిబాబు నేను మాట్లాడితే తల ఎక్కడ ? పెట్టుకోవాలో కూడా తెలియదు అంటూ సమంతను ఉద్దేశించి విమర్శలు చేశారు.

సమంత నేను చేసిన కామెంట్స్ గురించి మాట్లాడితే బాగుండేదని చురకలు కూడా అంటించారు. సమంత సినిమా ప్రమోషన్ల కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని.. విడాకుల తర్వాత జీవనోపాధి కోసం పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిందని చిట్టిబాబు తీవ్ర‌మైన‌ విమర్శలు చేశారు. సమంతకు అసలు ఆ పాత్ర ఎలా ?వచ్చిందో ఆశ్చర్యంగా ఉందని కూడా చిట్టిబాబు అన్న సంగతి తెలిసిందే.

ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయింది. అటు సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. హాలీవుడ్లో రుసో బ్రదర్స్ తెర‌కెక్కించిన ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్లో వరుణ్ ధావన్ – సమంత జంటగా నటించారు. అసలు వీరిద్దరి వివాదానికి కారణం పరిశీలిస్తే విడాకులు తర్వాత సమంత జీవనోపాధి కోసం చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తుందని.. స్టార్ హీరోయిన్ హోదా కోల్పోయిన తర్వాత వచ్చిన ప్రతి అవకాశం అందిపుచ్చుకుంటుందని.. హీరోయిన్గా ఆమె కెరీర్ ముగిసింది.. ఆమె సానుభూతి కోసం గ్రామాలు ఆడుతుందని చిట్టిబాబు విమర్శించారు.

చిట్టిబాబు తనపై చేసిన ఆరోపణలకు సమంతా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ప్రజలు తమ చెవుల్లో జుట్టును ఎలా ? పెంచుతారు అన్న విషయాన్ని తాను గూగుల్లో సెర్చ్ చేసినట్లు వెల్లడించింది. చెవుల్లో వెంట్రుకల పెరగటానికి టెస్టోస్టిరాన్ స్థాయిలు కారణమని గూగుల్ సమాధానం ఇచ్చింది అంటూ స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసింది. ఏదేమైనా స‌మంత‌, చిట్టిబాబు మ‌ధ్య గొడ‌వ‌లో చివ‌ర‌కు వెంటుక్ర‌ల‌పై కూడా విమర్శలు కౌంటర్లు నడుస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news