Moviesఉమెన్స్ డే స్పెషల్: ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే అప్ డేట్..కొత్త బంధంలోకి...

ఉమెన్స్ డే స్పెషల్: ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే అప్ డేట్..కొత్త బంధంలోకి అడుగుపెడుతున్న సంయుక్తా మీనన్.. !?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. అదే సంయుక్త మీనన్.. భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో సంయుక్త పాత్ర చాలా చిన్నది ..అయినా లాస్ట్ లో కథ మొత్తం ఆమె మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ క్రమంలోనే సినిమా హిట్ అవ్వడంతో ఆమె పేరు కూడా మారుమ్రోగిపోయింది.

ఆ తర్వాత బింబిసారా సినిమాలో నటించిన ఈ బ్యూటీ,, ఆ సినిమా కూడా హిట్ అయ్యింది. అయిన పెద్దగా సంయుక్త పేరు వినిపించలేదు . కానీ రీసెంట్గా నటించిన సార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఎక్కడ చూసిన సంయుక్త మీనన్ పేరు వినిపిస్తుంది . ఈ క్రమంలోని సంయుక్త మీనన్ కి సంబంధించిన చిన్న విషయం అయినా సరే ఇట్టే ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు. కాగా రీసెంట్గా ఉమెన్స్ డే సందర్భంగా సంయుక్త తన కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి తన లైఫ్ను త్యాగం చేసిన సంయుక్తా మీనన్.. ఈరోజు నుంచి ప్రజాసేవకు అంకితం అవ్వాలని భావిస్తుందట.

ఈ క్రమంలోని సోషల్ సర్వీస్ చేయడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తుంది . సంయుక్త ఉమెన్స్ డే సందర్భంగా ప్రజాసేవ చేయాలని డిసైడ్ అయ్యిందట . ఈ క్రమంలోనే ప్రజలతో మమేకం అవ్వాలని సంయుక్త భావిస్తుందట ఇలా ప్రజలతో కొత్త బంధాన్ని ఏర్పరచుకోవడానికి సంయుక్త మీనన్ రెడీగా ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో.. సంయుక్త ప్రేమాయణం నడుపుతుందన్న వార్తలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. రీసెంట్గా సార్ తో నటించి హిట్ కొట్టిన ఈ బ్యూటీ త్వరలోనే సార్ ఇంట్లో మేడం గా సెటిలైపోతుంది అంటూ జనాలు సైతం కామెంట్స్ చేస్తున్నారు .దీంతో సంయుక్త మీనన్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారం మ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news