MoviesShobhan Babu -Jayalalitha శోభ‌న్‌బాబు - జ‌య‌ల‌లిత పెళ్లి ఎందుకు ఆగిపోయింది.....

Shobhan Babu -Jayalalitha శోభ‌న్‌బాబు – జ‌య‌ల‌లిత పెళ్లి ఎందుకు ఆగిపోయింది.. అస‌లేం జ‌రిగింది…!

సీనియర్ నటుడు శోభన్ బాబు, దివంగత సీనియర్ హీరోయిన్ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మధ్య అనుబంధం గురించి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో పుకార్లు, షికార్లు ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలో శోభన్ బాబు జయలలితను చూసి ఇష్టపడడంతో పాటు ఆమెతో జీవితంలో ఒక్క సినిమాలో అయినా నటిస్తే చాలు జన్మ ధన్యం అయిపోతుందని ఎన్నో కలలు కన్నారు. శోభన్ బాబు కెరీర్ ప్రారంభంలో ఉన్నప్పుడే జయలలిత స్టార్ హీరోయిన్. ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేషన్ లాంటి హీరోలకు డేట్ లు ఇవ్వటమే కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో శోభన్ బాబు పక్కన ఒక సినిమాలో ఆమె హీరోయిన్గా ఎంపికైంది.

అలాంటి లక్కీ ఛాన్స్ శోభన్ బాబుకు వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. శోభన్ బాబు చాలా నిరాశ పడ్డారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు జయలలితతో ఛాన్స్ వచ్చింది. శోభన్ బాబులో ఉన్న నిరాడంబరత తనను ఇష్టపడుతున్న విధానం జయలలితకు కూడా నచ్చింది. అలా వారిద్దరూ కలిసి కొన్ని సినిమాలలో నటించారు వాళ్ళిద్దరు మంచి హిట్ ఫెయిర్ అన్న పేరు కూడా వచ్చేసింది. ఈ క్రమంలోనే ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు.

అయితే అప్పటికే శోభన్ బాబుకు పెళ్లి జరిగింది.. పిల్లలు కూడా ఉన్నారు. ఆ సమయంలో ఎంజీఆర్ రాజకీయాల్లోకి రావడం జయలలిత ఎంజీఆర్ కు సాన్నిహిత్యం కావడంతో ఆమె మనసు మారిందని అంటారు. వాస్తవంగా జయలలిత.. శోభన్ బాబును రెండో పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధంగానే ఉందని అనేవారు. ఎప్పుడు అయితే ఎంజీఆర్ తో సాన్నిహిత్యం ఏర్పడిందో రాజకీయాల్లోకి వెళితే మరింత క్రేజ్ వస్తుందన్న ఆలోచన ఆమె మదిలో కలిగిందో అప్పటినుంచి క్రమక్రమంగా శోభన్ బాబు – జయలలిత బంధం బీటలు వారిందంటారు.

చివరకు శోభన్ బాబు కూడా ఆమె చర్యల వల్ల ఎంతో మనోవేదనతో ఆమెకు దూరమయ్యారని అంటూ ఉంటారు. శోభన్ బాబు విషయంలో జయలలిత మనసు మారిందా ? లేదా ఎవరైనా మార్చారా అన్నది అంతుపట్టని రహస్యం అని.. ఆమెను, శోభన్ బాబును దగ్గరగా ఉండి చూసిన ప్రముఖ ఎనలిస్టు వాసిరాజు ప్రకాశం కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆయన శోభన్ బాబుతో కే విశ్వనాథ్‌ దర్శకత్వంలో కాలం మారింది అనే సినిమాను కూడా నిర్మించారు. వాస్తవంగా ముందు శోభన్ బాబు అంటే జయలలిత ఎంతో ఇష్టంగా ఉన్నా ఎంజీఆర్ తో సాన్నిహిత్యం తర్వాతే చివర్లో ఆమె శోభన్ బాబుకు దూరం అయిందని… అది శోభన్ బాబుని ఎంతో బాధించిందని కూడా ఆయన చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news