MoviesChiranjeevi - Balayya చిరంజీవే కాదు.. బాల‌య్య కూడా ఖైదీ టైటిల్‌తో...

Chiranjeevi – Balayya చిరంజీవే కాదు.. బాల‌య్య కూడా ఖైదీ టైటిల్‌తో హిట్ కొట్టాడని తెలుసా…!

తెలుగులో ఖైదీ అన్న టైటిల్ ప్రస్తావించగానే ముందుగా మెగాస్టార్ చిరంజీవి పేరే గుర్తుకు వస్తుంది. చిరంజీవిని తిరుగులేని మెగాస్టార్ గా మార్చిన సినిమా ఖైదీ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1983లో తెరకెక్కిన ఈ సినిమా ఒక్కసారిగా తెలుగు సినిమా గతిని కూడా మార్చింది. ఎన్టీఆర్ అదే సమయంలో రాజకీయాల్లోకి వెళ్ళటం.. ఆయన స్థానాన్ని భర్తీ చేసే హీరో తెలుగులో ఎవరు ? ఉన్నారా అని ఎదురుచూస్తున్న సమయంలో చిరంజీవి ఖైదీ సినిమాతో ఒక్కసారిగా లైన్ లోకి వచ్చేసాడు.

ఆ తర్వాత అదే ఖైదీ పేరు పెట్టుకుని ఖైదీ నెంబర్ 786 లాంటి సినిమాలు కూడా చేశారు. తెలుగులో ఖైదీ పేరుతో ఖైదీ రుద్రయ్య లాంటి సినిమాలు కూడా వచ్చాయి. ఇటీవల కాలంలో తమిళ హీరో కార్తీ డబ్బింగ్ సినిమా ఖైదీ వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఖైదీతో చిరంజీవి మాత్రమే సూపర్ హిట్ కొట్టారని చాలామంది అనుకుంటారు. అయితే ఎవరికీ తెలియని మరో సీక్రెట్ కూడా ఉంది. బాలకృష్ణ – కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి.

నిజానికి కోడి రామకృష్ణ తర్వాత బాలయ్య కెరీర్ను శిఖరాగ్రాన‌ నిలబెట్టిన ఘనత కచ్చితంగా కోదండరామిరెడ్డికి దక్కుతుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వీరి కాంబినేషన్లో తెరకెక్కయి. అలా 1989లో బాలయ్య, కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమా భలేదొంగ. దేవి ఫిలిమ్స్ పతాకంపై కె. దేవి వరప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. బాలయ్యకు జోడిగా విజయశాంతి ప్రధాన పాత్రలో నటించారు.

చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా గెలిచింది. ప్రస్తుత టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి ఈ సినిమాకు రచయితగా పనిచేశారు. వి ఎస్ ఆర్ స్వామి సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరించారు. ఈ సినిమాలో బాలయ్య సురేంద్ర అనే దొంగగా నటించారు. మెయిన్ విలన్ గా చరణ్‌ రాజ్ కనిపించారు.

అలాగే ఎస్పి ఇంద్రాణి పాత్రలో శారద నటించారు. తెలుగులో హిట్ అయిన ఈ సినిమాను ఖైదీ నెంబర్ 1 పేరుతో హిందీలోకి కూడా అనువదించారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా బాలయ్య కూడా ఖైదీ పేరుతో ఒక హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news