Moviesనందమూరి కళ్యాణ్ రామ్ కి ఏమైంది..? ప్రజెంట్ పరిస్ధితి ఎలా ఉంది..?...

నందమూరి కళ్యాణ్ రామ్ కి ఏమైంది..? ప్రజెంట్ పరిస్ధితి ఎలా ఉంది..? ఫుల్ డీటెయిల్స్ ఇవే..!!

వాట్ .. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రమాదానికి గురయ్యారా..? అంటే అవునని అంటున్నారు టాలీవుడ్ సినీ విశ్లేషకులు . మనకు తెలిసిందే నందమూరి హరికృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ .. ఎలాంటి స్థాయిని అందుకున్నాడో. కెరియర్ స్టార్టింగ్ లో హిట్ కోసం నానా తంటాలు పడిన హీరో కళ్యాణ్ రామ్ .. రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుని తనదైన స్టైల్ లో ముందుకు పోతున్నాడు. బింబిసారా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసిన కళ్యాణ్ రామ్.

ఆ తర్వాత వచ్చిన అమిగోస్ కోసం సినిమాతో కూడా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . త్వరలోనే బింబిసార 2 సెట్స్ పైకి రాబోతుంది. కాగా ప్రెసెంట్ కళ్యాణ్రామ్ డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట. ఈ క్రమంలోని నందమూరి కళ్యాణ్రామ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది . ఏకంగా 500 మంది ఫైటర్స్ తో ఎపిసోడ్ను భారీ బడ్జెట్లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది . కళ్యాణ్ రామ్ మీద ఫైట్ చిత్రీకరిస్తుండగా ఆయన కాలికి దెబ్బ తగిలినట్టు చర్మం కొంతమేర కాలిపోయి ఊడింది అంటూ సమాచారం అందుతుంది.

దీంతో వెంటనే సెట్లో ఉన్న సిబ్బంది ఆయనను హుటాహుటిన హాస్పిటల్ కి తరలించినట్లు మీడియాకు సమాచారం అందుతుంది. చిన్న దెబ్బ అయినా సరే ఆ నొప్పి ఎక్కువగా ఉండడంతో కళ్యాణ్ రామ్ కొన్ని రోజులపాటు ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ వేసి మరి రెస్ట్ తీసుకోనున్నాడు అంటూ తెలుస్తుంది . స్వల్ప గాయాలతో పెద్ద ప్రమాదం నుంచి కళ్యాణ్ రామ్ బయటపడ్డాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నందమూరి అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news