Movies"ఎవ్వడు ఏమనుకున్నా "ఐ డోంట్ కేర్"..ఆస్కార్ వేడుకకు అలాగే వెళ్తా".. హీట్...

“ఎవ్వడు ఏమనుకున్నా “ఐ డోంట్ కేర్”..ఆస్కార్ వేడుకకు అలాగే వెళ్తా”.. హీట్ పెంచేస్తున్న ఎన్టీఆర్ మాటలు..!!

కేవలం కొద్ది గంటలే మిగిలి ఉన్నాయి.. తెలుగు అభిమానులు ..కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆస్కార్ అవార్డ్స్ విన్నింగ్ లిస్ట్ అనౌన్స్ చేయడానికి కొద్దిగా అంటే కొద్దిగా టం మిగిలి ఉన్నాయి . ఈ క్రమంలోనే టాలీవుడ్ తో పాటు పలువురు స్టార్ ప్రముఖులు కూడా ఆస్కార్ అవార్డు విన్నింగ్ లిస్ట్ కోసం ఆశ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ టీం మరింత స్థాయిలో సినిమాకు ప్రమోషన్స్ నిర్వహిస్తుంది .

కాగా దర్శకధీరుడు రాజమౌళి సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాలో నటించిన ఇద్దరు హీరోలతో పాటు ఆరారార్ టీ మొత్తం అమెరికాలో హల్ చల్ చేస్తుంది . కాగా రీసెంట్ గానే అమెరికా చేరుకున్న ఎన్టీఆర్ ..తాజాగా ఈటి అనే హాలీవుడ్ టాక్ షోతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు తెలుగు జనాలను ఆకర్షిస్తున్నాయి .

ఈ షోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ..” ఫస్ట్ టైం ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నాను. ఫస్ట్ టైం రెడ్ కార్పెట్ పై నడవ బోతున్నాను. ఆ విషయం తలచుకుంటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి . చాలా సంతోషంగా ఉంది . ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆస్కార్ వేడుకల్లో రెడ్ కార్పెట్ పై మేము ఆర్ఆర్ఆర్ నటులుగా నడవబోమని ఇండియన్స్ గా.. భారతీయ చిత్ర పరిశ్రమ నుండి నటుడిగా నేను నడవబోతున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

ఇండియన్ గా నడిచి నా దేశం పట్ల నాకున్న గౌరవాన్ని తెలియజేస్తానని ..ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ గా కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే దేశభక్తిని చాటుతో చెప్పిన ఆయన మాటలు జనాలకు విపరీతంగా నచ్చేసాయి. ఆయన మాటలను ట్రెండ్ చేస్తున్నారు మరికొందరు . ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ని కొడుతుంది అంటూ తెలుగు జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news