MoviesJR NTR అద్గది..నందమూరి బిడ్డ అంటే అట్లుండాలి.. వాళ్ళకి పగిలిపోయే ఆన్సర్...

JR NTR అద్గది..నందమూరి బిడ్డ అంటే అట్లుండాలి.. వాళ్ళకి పగిలిపోయే ఆన్సర్ వచ్చిన్నట్లేగా..!!

ఆర్ ఆర్ ఆర్ ఈ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనందరికీ తెలిసిందే . దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ దేశాలను ఓ రేంజ్ లో కుదిపేస్తుంది. మరి ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ క్రిటిక్స్ విభాగంలో ఏకంగా నాలుగో అవార్డులను అందుకున్న తర్వాత రాజమౌళి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అంతేకాదు మార్చి 12న అనౌన్స్ చేసే ఆస్కార్ నామినేషన్ కు ఆర్ఆర్ఆర్ సెలెక్ట్ అయింది .

ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా కచ్చితంగా ఆస్కార్ అవార్డు అందుకుంటుంది అంటూ తెలుగు అభిమానులు జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ని కొందరు ఆకతాయిలు టార్గెట్ చేసే ట్రోల్ చేస్తున్నారు . మనకు తెలిసిందే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ఆర్ టీం అమెరికాలో ఉన్నారు . సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అయితే నందమూరి తారకరత్న మరణించిన కారణంగా ఇక్కడ పనులు చూసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళలేదు .

రీసెంట్గా తారకరత్న కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాయి . ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆస్కార్ అవార్డుల ఫంక్షన్కు వెళ్లనున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు అలా చేసి సోషల్ మీడియాలో ఎవరైతే తనని ట్రోల్ చేస్తున్నారో ..వాళ్ళకి పగిలిపోయే ఆన్సర్ ఇస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. నిజంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కొట్టి స్టేజ్ పై అవార్డు అందుకుంటుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కళ .. చూద్దాం మరి వాళ్ల డ్రీమ్ నెరవేరుతుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news