Moviesవామ్మో.. డాక్టర్ బాబు ఆస్తి అన్ని కోట్లా..? కొత్త ఇల్లు ధర...

వామ్మో.. డాక్టర్ బాబు ఆస్తి అన్ని కోట్లా..? కొత్త ఇల్లు ధర తెలిస్తే..దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీసే కాదు బుల్లితెరపై చిన్న సీరియల్స్ లో నటించే బుల్లితెర స్టార్స్ కూడా కోట్లకు కోట్లు ఖర్చు చేసి ఇల్లులు కట్టుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యాంకర్ శ్యామల.. స్టార్ సెలబ్రిట్స్ కి మించిన స్థాయిలో ఉండే ఇల్లును కొనుగోలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అయింది. అంతేనా రీసెంట్గా మరో ఇంటికి శంకుస్థాపన చేసి స్టార్స్ కి సైతం మైండ్ బ్లాక్ చేసింది. ఒక యాంకర్ ఇలా కోట్లు ఖర్చు చేసి ఇల్లు కట్టడం ఏంటా అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు.

కాగా తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు బుల్లితెరపై డాక్టర్ బాబు గా పేరు సంపాదించుకున్న నిరుపమ్. మనకు తెలిసిందే మాటీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ ద్వారా ఫేమస్ అయిన నిరూపమ్ డాక్టర్ బాబుగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ని పెట్టుకుని లైఫ్ అప్ డేట్స్ ని అభిమానులకి తెలియజేస్తూ వచ్చిన నిరుపమ్.. రీసెంట్గా కొత్త ఇంటిని కట్టుకున్నాడు . దీనికి సంబంధించిన వీడియో ని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసుకొచ్చాడు .

తాజాగా ఓ వీడియో లో మాట్లాడుతూ నిరూపమ్ ఆ ఇంటి గురించి చెప్పకు వచ్చారు . వాళ్ళ నాన్న ఆ ఇంటిని బుక్ చేశారట ..గతంలో ప్రభుత్వం సినీ కార్మికుల కోసం మంజూరు చేసిన హౌసింగ్ సొసైటీ ద్వారా ఈ ఇల్లు వచ్చింది అంటూ క్లారిటీ ఇచ్చారు . “మా నాన్న లేకపోవడంతో ఆ ఇల్లు నాకు వచ్చింది అంటూ కూడా చెప్పుకొచ్చాడు”. అయితే ఆయన బుక్ చేసి దాదాపు 18 ఏళ్లు అవుతుందని లేట్ అయిన ఇల్లు చేతికి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు . ఈ ఇంటిలో ఇంటీరియర్ డిజైనర్ కోసమే నిరూపమ్ కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్ పనులు పూర్తయిన వెంటనే గృహప్రవేశం అని కూడా నిరూపమ్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.

నిరుపమ్ తండ్రి ఎవరో కాదు ఆయన టాలీవుడ్ లో ఒకప్పుడు రైటర్ గా.. నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న ఓంకార్.. ఆయన టాలీవుడ్ లో రైటర్ గా, నటుడిగా ఎంతో పేరు గడించారు. ఆయన మరణం తరువాత వారసుడిగా నిరుపమ్ ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు. నిరూపమ్ తన భార్యతో చేసే షాపింగ్ చూసి ఆయన నెల సంపాదన లక్షల్లోనే ఉంటుందని సంవత్సరానికి కోట్లలోనే టర్న్ ఓవర్ ఉంటుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు .

నిరుపమ్ భార్య ఎప్పుడు షాపింగ్ చేస్తూనే ఉంటుందన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. రీసెంట్గా కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతున్నామంటూ అఫీషియల్ గా ప్రకటించడంతో నిరూపమ్ ఆస్తులు చిట్టాకు సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . బుల్లితెరపై సీరియల్స్ చేసుకునే నటుడు కోట్లు ఖర్చు చేసి టే ఇంటీరియర్ డిజైనర్ చేయిస్తున్నారు అనగానే జనాలు షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news