Moviesనానిని న‌మ్మితే నిండా ముంచేస్తున్నాడా… కెరీర్ బ్యాడ్ అవుతోంది…!

నానిని న‌మ్మితే నిండా ముంచేస్తున్నాడా… కెరీర్ బ్యాడ్ అవుతోంది…!

నేచుర‌ల్ స్టార్ నాని ఒక‌ప్పుడు ఆరేడు వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్‌లో టాప్ హీరోల‌కే గ‌ట్టి స‌వాల్ విసిరాడు. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ హిట్‌. త‌క్కువ ఖ‌ర్చుతో పాటు మంచి లాభాలు వ‌చ్చేవి. దీంతో నానితో సినిమాలు చేసేందుకు పెద్ద నిర్మాత‌ల నుంచి మీడియం రేంజ్ నిర్మాత‌లు అంద‌రూ క్యూలో ఉండేవారు. అస‌లు యేడాదికి మూడు – నాలుగు సినిమాలు ట‌క‌ట‌కా రిలీజ్ చేసేసేవాడు. అన్నీ హిట్లే. భారీ లాభాలే. ఇదంతా గ‌తం. ఇప్పుడు నాని సీన్ రివ‌ర్స్ అయిపోయింది.

ఒక‌ప్పుడు నాని న‌ట‌న అంటే అబ్బో అని పొగిడేసేవారు. కానీ ఇప్పుడు అదే నాని న‌ట‌న ఓ మొనాట‌నీ అయిపోయింది. బోర్ కొట్టిం చేస్తున్నాడు. ఒకే విధ‌మైన డైలాగ్ మాడ్యులేష‌న్‌, యాక్ష‌న్‌, కామెడీ అస‌లు వేరియేష‌న్లు ఉండ‌డం లేదు. దీనికి తోడు క‌థ‌ల ఎంపిక‌లో కొత్త‌ద‌నం ఉంటున్నా.. అందులో క‌మ‌ర్షియాలిటీ మిస్ అయిపోతోంది. అందుకే నాని సినిమాలు బాగున్నాయి అంటున్నారే త‌ప్పా వ‌సూళ్లు రావ‌డం లేదు.

దీనికి తోడు మారిన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా నాని క‌థ‌లు ఎంచుకోవ‌డం లేదు. నాని ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ రోల్ ఏంటి ? అసలు ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ మార్కెట్ ఏంటి ? నాని మార్కెట్ ఏంట‌న్న‌ది కంపేరిజ‌న్ చేసుకుంటే నాని ఎంత వెన‌క‌ప‌డిపోయాడో తెలుస్తోంది. దీనికి తోడు నాని రెమ్యున‌రేష‌న్ విప‌రీతంగా పెంచేశాడ‌నే అంటున్నారు. ఇది నాని సినిమాల బ‌డ్జెట్ పెరిగి, ప్రి రిలీజ్ బిజినెస్ పెరిగి వ‌సూళ్లు రాక‌పోవ‌డంతో మార్కెట్ దెబ్బ‌తింటోంది.

ఏదో నాన్ థియేట్రిక‌ల్ ఆదాయం ఉండ‌బ‌ట్టి స‌రిపోతోందే కాని.. లేక‌పోతే నాని అన్నీ సినిమాల‌కు భారీ న‌ష్టాలు త‌ప్ప‌వు. అంటే సుంద‌రానికి మంచి టాక్ వ‌చ్చినా న‌ష్టాలు మూట‌క‌ట్టుకుంది. అంత‌కుముందు ఉన్న శ్యామ్‌సింగ రాయ‌ది అదే ప‌రిస్థితి. జెర్సీకి హిట్ టాక్ వ‌చ్చినా న‌ష్టాలే మిగిలాయి. ఇక ఇప్పుడు ద‌స‌రా సినిమా చేస్తున్నాడు. రెమ్యున‌రేష‌న్ ఎక్కువుగా తీసుకుంటున్నాడు. బ‌డ్జెట్ రు. 70 కోట్లు దాటేసింది. నిర్మాత డెపిసిట్‌తో రిలీజ్ చేస్తున్నాడు. ఓవ‌ర్ ఫ్లోస్ వ‌స్తే త‌ప్పా నిర్మాత‌ల‌కు లాభం సంగ‌తి దేముడు ఎరుగు… న‌ష్టాలు త‌ప్ప‌వు.

ఏదేమైనా నానితో సినిమాలు తీసే ద‌ర్శ‌కులు ఆలోచ‌న చేయాలి.. ఇటు నాని కూడా మారాలి. సినిమా హిట్ అని టాక్ వ‌స్తే కాదు… వ‌సూళ్లు రావాలి.. ఆ సినిమా చేసిన వాళ్ల‌కు, కొన్న‌వాళ్ల‌కు లాభాలు రావాలి. నాని క‌థ‌ల ఎంపిక మార్చుకోవాలి. అవ‌స‌రాన్ని బ‌ట్టి రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోవాలి. లేక‌పోతే నాని అంటూ మాయ‌లో ప‌డితే నిర్మాత‌లు నిండా మునిగిపోవ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news