MoviesSamantha స‌మంత ఈ ఫోటో వెన‌క ఇంత హిస్ట‌రీ ఉందా…...

Samantha స‌మంత ఈ ఫోటో వెన‌క ఇంత హిస్ట‌రీ ఉందా… ఇన్నాళ్ల‌కు బ‌య‌ట ప‌డింది…!

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సమంత. చెన్నై అమ్మాయి సమంత తెలుగులో అక్కినేని హీరో నాగచైతన్య పక్కన ఏ మాయ చేసావే సినిమాలో నటించింది. దర్శకుడు గౌతమ్ మీన‌న్ తెర‌కెక్కించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా సామ్‌ తొలి సినిమాతోనే కుర్ర కారు మదిని దోచేసింది. అక్కడ నుంచి సమంత వెనక్కు తిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ పోయింది. ఏడెనిమిది సంవత్సరాలు అసలు సమంత‌కు తెలుగులో తిరుగు లేకుండా పోయింది.

తెలుగుతో పాటు అటు తమిళంలోనూ స్టార్ హీరోలకు జోడిగా నటించి సూపర్ హిట్లు కొట్టింది. తెలుగు, తమిళ సినిమా రంగంపై గత పదేళ్లలో ముద్ర వేసిన హీరోయిన్లలో సమంత కచ్చితంగా ఉందనే చెప్పాలి. ఆ తర్వాత ఆమె జీవితం అనూహ్యంగా మలుపులు తిరిగింది. తన తొలి సినిమా హీరో నాగచైత‌న్య‌ను పిచ్చిపిచ్చిగా ప్రేమించి 2017లో పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ల సంసార జీవితం అనంతరం 2021 చివరలో వీరు విడాకులు తీసుకున్నారు.

వీరు విడాకులు తీసుకుని ఏడాదిన్నర అవుతున్నా.. ఇప్పటికీ వీరిద్దరి వార్తలు మెయిన్ మీడియాను… సోషల్ మీడియాలోను ఒక రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో సిటాడెల్ – శకుంతల – ఖుషి సినిమాలతో పాటు హాలీవుడ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇలా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న సమంత ఇండస్ట్రీలోకి వచ్చి 13 ఏళ్లు పూర్తి అవుతుంది.

ఇక ఆమె క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా మారి 13 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా అంద‌రూ సోష‌ల్ మీడియాలో ఆమెకు విషెస్ చెపుతున్నారు. ఇక యాక్ట‌ర్ కం డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ కూడా ఆమె విషెస్ చెప్పాడు. 14 ఏళ్ల క్రితం ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్పుడు ఆమె రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో ఓ త‌మిళ్ సినిమాలో న‌టించింది. ఆ స‌మ‌యంలో తాను మేడ‌మీద తీసిన ఫొటోను షేర్ చేసి మ‌రీ రాహుల్ స‌మంత‌కు విషెస్ చెప్పాడు.

14 ఏళ్ల క్రితం స‌మంత టెర్ర‌స్‌పై దిగిన ఫొటోను తాను గుర్తించా… 13 ఏళ్ల కెరీర్ విజ‌య‌వంతంగా పూర్తి చేసినందుకు స‌మంత‌కు ప్ర‌త్యేక విషెస్ అంటూ రాహుల్ ర‌వీంద్ర‌న్ ట్వీట్ చేశాడు. దానికి స‌మంత కూడా థ్యాంక్స్ చెప్ప‌డంతో ఇప్పుడు ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news