Moviesఓ మై గాడ్: కృతిశెట్టి అక్కడికి వెళ్లింది అందుకా..? హీట్ పుట్టిస్తున్న...

ఓ మై గాడ్: కృతిశెట్టి అక్కడికి వెళ్లింది అందుకా..? హీట్ పుట్టిస్తున్న కన్నడ పిల్ల ముంబై టూర్..!!

టాలీవుడ్ యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న కృతిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ తో కలిసి ఉప్పెన సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి. అయితే ఆ తర్వాత చేసిన మూడు సినిమాలు డిజాస్టర్ గా మారడంతో కృతి శెట్టి పేరును జనాలు మరిచిపోయారు .

ఈ క్రమంలోనే తన పేరును జనాలు మర్చిపోకుండా ఉండేందుకు కృతిశెట్టి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. అయినా సరే బేబమ్మను ఎవరు పట్టించుకోవడం లేదు . ఈ క్రమంలోనే ఇక టాలీవుడ్ తో పని కాదు అంటూ బాలీవుడ్ కి చెక్కేయాలని చూస్తుంది కృతి శెట్టి . ఈ క్రమంలోనే రీసెంట్గా తండ్రితో ముంబైలోని ఓ హోటల్ ను సందర్శించింది. కాగాఆ హోటల్ దగ్గర ఫోటోకో ఫోజులిచ్చి ముంబై మీడియాను షేక్ చేసింది.

బ్లూ జీన్స్ వైట్ టాప్ లో కృతి శెట్టి చాలా హాట్ గా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కృతి శెట్టి ఇలా ముంబైలోని హోటల్ ను సందర్శించడానికి మెయిన్ రీజన్ ఆమె బాలీవుడ్ లో అవకాశాలు అందుకోవడానికే అంటూ తెలుస్తుంది. టాలీవుడ్ తో ఇక పని అవ్వదని బాలీవుడ్ లో ఆఫర్స్ కోసం ట్రై చేస్తుందని.. ఈ క్రమంలోని అక్కడ మీడియా కంటపడితే కచ్చితంగా బాలీవుడ్ స్టార్ హీరోల కళ్ళల్లో పడొచ్చని.. తద్వారా ఒక్క అవకాశం అందుకున్నా సరే చేజారిపోయిన తన కెరీర్ని మళ్ళీ ఊపందుకునేలా తీసుకురావాలనుకుంటుందంటూ టాక్ వినిపిస్తుంది . అందుకే కృతి శెట్టి యమ సెక్సీగా రెడీ అయ్యి ముంబైకి చెక్కేసింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే కన్నడ పిల్ల తెలివితేటలకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news