MoviesKeerthy Suresh కీర్తి సురేష్ అలా చేస్తే తెలుగు హీరోలు ఊరుకునేదేలే...

Keerthy Suresh కీర్తి సురేష్ అలా చేస్తే తెలుగు హీరోలు ఊరుకునేదేలే .. బాయ్ కాట్ చేసేస్తారా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గ్లామరస్ ప్రపంచంలో గ్లామర్ గా ఉన్న అంత కాలం ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగ గలరు . ఎప్పుడైతే గ్లామర్ తగ్గుతుందో ఆ తర్వాత డైరెక్టర్స్ – ప్రొడ్యూసర్స్ – హీరోస్ -జనాలు ఎవరూ పట్టించుకోరు . అయితే గ్లామర్ గా ఉన్నప్పుడు మాత్రం స్టార్ హీరోయిన్ ఏం చేసిన ఎగబడిపోతుంటారు…సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ . ఈ క్రమంలోనే రీసెంట్గా కీర్తి సురేష్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

మనకు తెలిసిందే మహానటి సినిమాతో తన పేరుని స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ చేసుకున్న కీర్తి సురేష్.. ప్రజెంట్ కోలీవుడ్లో మాత్రమే సినిమాలు చేస్తుంది. టాలీవుడ్ లో రెండే రెండు సినిమాలు చేస్తుంది . నాని సరసన దసరా . చిరంజీవికి చెల్లెలుగా బోళా శంకర్ సినిమా చేస్తుంది . ఈ రెండు తప్పిస్తే కీర్తి సురేష్ ఖాతాలో సినిమాలు ఏం లేవు. కోలీవుడ్ మాత్రం మూడు సినిమాలు చేస్తుంది . అయితే సర్కారి వారి పాట సినిమా తర్వాత తనలోని గ్లామర్ డోస్ ని పెంచిన కీర్తి సురేష్.. రీసెంట్గా కమిట్ అయిన కోలీవుడ్ సినిమాలో లిప్ లాక్ చేయడానికి సిద్ధపడిందట.

ఈ క్రమంలోనే టాలీవుడ్ డైరెక్టర్ లు ఫైర్ అవుతున్నట్లు తెలుస్తుంది . ఇన్నాళ్లు మేము ఎన్నిసార్లు లిప్ లాక్ చేయమన్న.. లిప్ లాక్ సీన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూయించలేదు అని..ఇప్పుడు మాత్రం కోలీవుడ్ హీరోలతో అలాంటి సీన్స్ చేయడానికి సిద్ధపడిందని .. ఒకవేళ నిజంగా కీర్తి సురేష్ కోలీవుడ్ హీరోలతోనే లిప్ లాక్ చేసే పరిస్థితి వస్తే .. ఆమెను తెలుగులో కచ్చితంగా బాయ్ కాట్ చేస్తామంటూ చెప్పుకొస్తున్నారట . ఇదే న్యూస్ సినీ వర్గాలల్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు తెలుగు హీరోలు కూడా కీర్తి సురేష్ ని బాయ్ కాట్ చేయాల్సిందే అంటూ ఫిక్స్ అవ్వడం సంచలనంగా మారింది. కోలీవుడ్ హీరోలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మనల్ని తక్కువ చేస్తే ఊరుకునేది లేదు అంటూ చెప్పుకొస్తున్నారట . దీంతో కీర్తి సురేష్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news