MoviesKiara-siddu రిచ్చెస్ట్ క‌ఫుల్స్‌: కియారా - సిద్ధార్థ్ ఆస్తులు లెక్క‌లు చూస్తే...

Kiara-siddu రిచ్చెస్ట్ క‌ఫుల్స్‌: కియారా – సిద్ధార్థ్ ఆస్తులు లెక్క‌లు చూస్తే క‌ళ్లు జిగేల్‌..!

ఎట్ట‌కేల‌కు బాలీవుడ్‌లో మ‌రో క‌ఫుల్స్ ఒక్క‌ట‌య్యారు. గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో మునిగి తేలుతోన్న స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ఇద్ద‌రూ పెళ్లి బంధంతో ఒక్క‌ట‌య్యారు. రెండు కంపెనీలు క‌లిసిన‌ప్పుడు ఆటోమేటిక్‌గా ఎలా ? నెట్‌వ‌ర్క్ పెరుగుతుందో ? అలాగే ఇద్ద‌రు స్టార్లు క‌లిసిన‌ప్పుడు కూడా ఆటోమేటిక్‌గా ఆస్తి పెరుగుతుంద‌న్న‌ట్టుగానే ఇప్పుడు సిద్ధార్థ్‌, కియారా క‌ల‌వ‌డంతో.. వారు ఒక్క‌టి కావ‌డంతో ఆటోమేటిక్‌గానే వీరి ఆస్తి పెరిగింది. ఇప్పుడు వీరి ఉమ్మ‌డి ఆస్తి క‌లిపితే బాలీవుడ్ రిచ్చెస్ట్ క‌ఫుల్స్ జాబితాలో వీరు చేరిపోయారు.

ప్ర‌స్తుతం సిద్ధార్థ్ మ‌ల్హోత్రా బాలీవుడ్‌లోనే మోస్ట్ ప్రామీసింగ్ హీరోల్లో ఒక‌డిగా కొన‌సాగుతున్నాడు. బాయ్ నెక్ట్స్ డోర్ లుక్స్‌తో యూత్‌కు పిచ్చ‌గా క‌నెక్ట్ అయిపోయాడు. అస‌లు టాప్ బ్రాండ్స్ యాడ్స్‌కు సిద్ధార్థ్ కేరాఫ్ అడ్ర‌స్ అయిపోయాడు. ప్ర‌స్తుతం సిద్ధార్థ్ ఒక్కో యాడ్‌కు రు. 3 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఒక్కో సినిమాకు రు. 7 – 8 కోట్ల మ‌ధ్య‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు.

యావ‌రేజ్‌గా చూస్తే సిద్ధార్థ్ నెల సంపాద‌న కోటి నుంచి కోటిన్న‌ర మ‌ధ్య‌లో ఉంటుందంటున్నారు. దీనికి తోడు సిద్ధార్థ్‌కు ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. ముంబైలో చాలా ఖ‌రీదైన ప్లాట్ ఉంది. షారుక్ భార్య గౌరీఖాన్ ఈ ప్లాట్‌ను బాగా డిజైన్ చేసింది. ఇక రు 2.26 కోట్ల రేంజ్ రోవ‌ర్ కారు, మ‌రో 2 బెంజ్ కార్లు కూడా ఉన్నాయి.ఇక ఇత‌డి భార్య కియారా ఇప్పుడు రెండు చేతులు సంపాదిస్తోంది. బాలీవుడ్‌లో ఆమె ఒక్కో సినిమాకు రు. 3 కోట్లు తీసుకుంటోంది.

ఇక ఆమె చేస్తోన్న యాడ్స్‌కు కొద‌వేలేదు. వీటితో పాటు సోష‌ల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోవ‌ర్ల ద్వారా కూడా బాగా సంపాదిస్తోంది. ఆమె స్థిరాస్తుల విష‌యానికి వ‌స్తే ముంబైలో రు. 15 కోట్ల ఫ్లాట్ ఉంది. ఇప్పుడు సిద్ధార్థ్‌, కియారా పెళ్లి చేసుకోవ‌డంతో ఈ జంట నెల ఆదాయం స‌గ‌టున రెండున్న‌ర కోట్ల‌కు పైనే ఉంటుందంటున్నారు. ఓవ‌రాల్‌గా చూస్తే వీరిద్ద‌రి ఎస్సెట్స్ విలువ రు. 125 – 130 కోట్ల‌కు పైనే ఉంటుందంటున్నారు.

ఓ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రకారం వీరిద్ద‌రి ఆస్తి యేడాదికి స‌గ‌టున 21 శాతం పెరుగుతుంద‌ని అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు వీరిద్ద‌రు బాలీవుడ్‌లోనే రిచ్చెస్ట్ క‌ఫుల్స్ జాబితాలో అయితే చేరిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news