MoviesKamal Hassan సారిక కంటే ముందు ఆ స్టార్ హీరోయిన్ ప్రేమ‌లో...

Kamal Hassan సారిక కంటే ముందు ఆ స్టార్ హీరోయిన్ ప్రేమ‌లో క‌మ‌ల్‌…!

స‌రిత‌.. ఇప్ప‌టి త‌రానికి పెద్ద‌గా ప‌రిచ‌యం లేని పేరు అయితే.. టీవీ సీరియ‌ళ్ల‌లో ఇర‌గ‌దీస్తున్న ఒక‌ప్ప‌టికి న‌ల్ల కుట్టి! మ‌హేష్‌బాబు హీరోగా వ‌చ్చిన అర్జున్‌ సినిమాలో విల‌న్‌గా న‌టించి మెప్పించిన న‌టీమ‌ణి అయి తే.. ఎక్కువ‌గా బాల చంద‌ర్ తీసిన సినిమాల్లో మ‌న‌కు క‌నిపిస్తుంది. అస‌లు స‌రిత‌ను ప్ర‌మోట్ చేసింది బాల‌చంద‌రే. మ‌రోచ‌రిత్ర సినిమాతో స‌రిత పేరు నేష‌న‌ల్ వైడ్‌గా ఎలా ? మార్మోగిపోయిందో చూశాం. మ‌రో చ‌రిత్ర సినిమా.. స‌రితకు పెద్ద మైలురాయిగా చెప్పుకోవాలి. ఈ సినిమా ప్రేమ క‌థ అంశంగా తెర‌కెక్కించారు బాల‌చంద‌ర్.

అయితే.. ఇదే సినిమాతో స‌రిత పేరు ఇటు టాలీవుడ్‌.. అటు కోలీవుడ్‌లోనూ మార్మోగిపోయింది. దీనికి కార‌ణం.. మ‌రో చ‌రిత్ర సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్‌తో విచ్చ‌ల‌విడిగా న‌టించేయ‌డ‌మే. క‌థ డిమాండ్ చేసిన సంద‌ర్భంలో ఏదైనా చేసేందుకు రెడీ అని స్టేట్‌మెంట్లు ఇచ్చిన ద‌క్షిణాది న‌టిగా స‌రిత‌కు పేరుంది. త‌ర్వాత కుష్బు.. అలాంటి స్టేట్‌మెంట్లు ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే మ‌రోచ‌రిత్ర‌లో బొడ్డులో బొంగ‌రం తిప్పే సీన్ చేశారు.

అయితే.. ఈ సినిమాకు కూడా శంక‌రాభ‌ర‌ణం మాదిరిగానే ఓపెనింగ్ డ‌ల్‌. త‌ర్వాత త‌ర్వాత‌.. ఏడాది పాటు ఆడి పేరు తెచ్చుకుంది. సినిమాలో అన్ని పాట‌లూ సూప‌ర్ హిట్‌గానే ఉన్నాయి. అయితే.. సినిమా త‌ర్వాత‌.. ఎక్క‌డ ఎవ‌రి నోట విన్నా.. స‌రితా.. క‌మ‌ల్ హాస‌న్ ల‌వ‌ర్స్ అనే పేరు మార్మోగిపోయింది. అయితే.. ఇది ఉద్దేశ పూర్వ‌కంగా ఒక డైరెక్ట‌ర్ సృష్టించార‌ని త‌ర్వాత‌.. చ‌ర్చ‌కు వ‌చ్చింది. సినిమా హిట్ట‌య్యేందుకు కొన్ని గ్యాసిప్‌లు కూడా ఉప‌యోగ‌ప‌డతాయ‌ని.. ఈ సినిమా నిరూపించింది.

అయితే.. అప్ప‌టికే క‌మ‌ల్ సారిక‌తో ప్రేమ‌లో ఉండ‌డం.. త‌ర్వాత వారు వివాహం చేసుకోవ‌డం మ‌రో స్టోరీ. కానీ, స‌రిత‌.. క‌మ‌ల్ అంటే.. ఇప్ప‌టికీ త‌మిళ‌నాడులో మాజీ ల‌వ‌ర్స్‌గానే చెప్పుకొంటారు. కానీ, వారి మ‌ధ్య ఏమీలేద‌ని.. ఒక సంద‌ర్భంలో బాల‌చంద‌ర్ వెల్ల‌డించారు. ఇదీ.. సంగ‌తి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news