MoviesNandamuri నంద‌మూరి జోరు ఆగేలా లేదే.. యాంటీ ఫ్యాన్స్‌లోనూ అమిగోస్‌కు అదిరే...

Nandamuri నంద‌మూరి జోరు ఆగేలా లేదే.. యాంటీ ఫ్యాన్స్‌లోనూ అమిగోస్‌కు అదిరే టాక్‌..!

నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన అమిగోస్ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క‌ళ్యాణ్‌రామ్ గ‌తేడాది చివ‌ర్లో బింబిసార లాంటి సూప‌ర్ హిట్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్ కొట్టాడు. ప‌టాస్ త‌ర్వాత మ‌ధ్య‌లో 118 వ‌దిలేస్తే క‌ళ్యాణ్‌రామ్‌కు బింబిసార మాత్ర‌మే హిట్ అయ్యింది. అంతే కాదు క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే రు. 40 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టి తిరుగులేని క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

ఇప్పుడు ఆ హిట్ ట్రాక్‌ను క‌ళ్యాణ్ త‌న తాజా సినిమా అమిగోస్‌తోనూ కంటిన్యూ చేశాడు. ఈ రోజు ఇప్ప‌టికే ప్రీమియ‌ర్లు కంప్లీట్ చేసుకున్న అమిగోస్‌కు యునాన‌మ‌స్‌గా అదిరిపోయే టాక్ వ‌చ్చేసింది. క‌ళ్యాణ్‌రామ్ ఒక్క హిట్ రావడానికే యేళ్లు ప‌ట్టేది. అలాంటి నాలుగు నెల‌ల గ్యాప్‌లో క‌ళ్యాణ్ రెండో సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకు ముందు నుంచి అన్నీ క‌లిసి వ‌చ్చాయి.

బింబిసార హిట్ అవ్వ‌డం.. ఇటు మైత్రీ లాంటి పెద్ద బ్యాన‌ర్లో సినిమా చేయ‌డం.. స్టిల్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌కు ముందు నుంచే అదిరిపోయే రెస్పాన్స్ రావ‌డం.. పైగా కళ్యాణ్ ట్రిఫుల్ రోల్స్‌లో ఓ పాత్ర నెగ‌టివ్ షేడ్స్‌తో అద‌ర‌గొట్టేయ‌డం.. హీరోయిన్ అషికా గ్లామ‌ర్ ట‌చ్‌, ముందే ప్రి రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అవ్వ‌డం, అడ్వాన్స్ బుకింగ్‌లు బాగుండ‌డం ఇవ‌న్నీ ఈ సినిమాకు చాలా క‌లిసొచ్చాయి.

పైగా మైత్రీ వాళ్లు సంక్రాంతికే తీసిన రెండు పెద్ద సినిమాలు వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్ట‌డం.. ఇప్పుడు అదే బ్యాన‌ర్లో ఈ సినిమా రావ‌డం కూడా కొంత ప్ల‌స్ అయ్యింది. ఇక ఈ రోజు ప్రీమియ‌ర్ల త‌ర్వాత క‌ళ్యాణ్‌రామ్ స్క్రిఫ్ట్ సెల‌క్ష‌న్ మ‌రోసారి అదిరిపోయింద‌నే అంటున్నారు. అమిగోస్ ఎంగేజింగ్ థ్రిల్ల‌ర్ అని.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఇదో భిన్న‌మైన అనుభ‌వం అని ప్ర‌తి ఒక్క‌రు మెచ్చుకుంటున్నారు.

చాలా క‌ష్ట‌మైన త్రిబుల్ రోల్ స‌బ్జెక్ట్‌ని… ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి గంద‌ర‌గోళం లేకుండా ద‌ర్శ‌కుడు రాజేంద్ర రెడ్డి హ్యాండిల్ చేసిన తీరుకు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా బిపిన్ రాయ్ క్యారెక్ట‌రైజేష‌న్ ఎంతో స్పెష‌ల్‌గా నిల‌వ‌గా… క‌ళ్యాణ్ ఆ పాత్ర‌ను చాలా ప‌ర్‌ఫెక్ట్‌గా చేశాడ‌నే అంటున్నారు. ఇక మైత్రీ వాళ్ల నిర్మాణ విలువ‌లు అదిరిపోయాయ‌ని.. హీరోయిన్ అషిక గ్లామ‌ర్ ట‌చ్చింగ్‌తో పాటు సినిమా చాలా బాగుంద‌ని మిగిలిన హీరోల అభిమానులు కూడా ఓవ‌ర్సీస్‌, ఇత‌ర దేశాల ప్రివ్యూల నుంచి కామెంట్ చేస్తున్నారు.

ఏదేమైనా ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో నంద‌మూరి జోష్ అయితే కంటిన్యూ అవుతోంది. ఎన్టీఆర్‌కు వ‌రుస‌గా ఆరు హిట్లు, ఇటు బాల‌య్య అఖండ‌, వీర‌సింహారెడ్డి లాంటి రెండు వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్లు.. ఇప్పుడు క‌ళ్యాణ్‌రామ్‌కు కూడా బింబిసార త‌ర్వాత అమిగోస్ రూపంలో సూప‌ర్ హిట్లు ప‌డ్డాయి. నంద‌మూరి వారి జోరు అయితే మామూలుగా లేద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news