MoviesNaga Chaithanya ఆ వ్యక్తే నాగ‌చైత‌న్య కెరీర్ నాశ‌నం చేశాడా.. రెండుసార్లు...

Naga Chaithanya ఆ వ్యక్తే నాగ‌చైత‌న్య కెరీర్ నాశ‌నం చేశాడా.. రెండుసార్లు ముంచేశాడుగా…!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు హిట్ కాంబినేషన్లుగా పేరు ఉంటుంది. ఆ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చిన వెంటనే ఆ సినిమాల హక్కుల కోసం బయ్యర్లు సైతం భారీ మొత్తం ఆఫర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తారక్ రాజమౌళి కాంబో, ప్రభాస్ రాజమౌళి కాంబో, బాలయ్య బోయపాటి కాంబో, చిరంజీవి వినాయక్ కాంబో, బన్నీ త్రివిక్రమ్ కాంబో ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ కాంబోలుగా గుర్తింపును సొంతం చేసుకున్నాయి.

కొందరు హీరోలు కొంతమంది దర్శకులను లక్కీ డైరెక్టర్లుగా భావిస్తే మరి కొందరు హీరోలు మాత్రం కొంతమంది నిర్మాతలను లక్కీ ప్రొడ్యూసర్లుగా భావిస్తారు. అయితే ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ల గురించి ఏ రేంజ్ లో చర్చ జరుగుతుందో ఫ్లాప్ కాంబోల గురించి కూడా అదే రేంజ్ లో చర్చ జరుగుతుంది. అక్కినేని హీరో నాగచైతన్య కెరీర్ కు నిర్మాత దిల్ రాజు వల్ల కోలుకోలేని దెబ్బలు తగిలాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నాగచైతన్య దిల్ రాజు కాంబోలో రెండు సినిమాలు తెరకెక్కాయి. నాగచైతన్య తొలి సినిమా జోష్ సినిమాకు వాసువర్మ డైరెక్టర్ కాగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. కొంతమంది అభిమానులకు ఈ సినిమా నచ్చినా తల, తోక లేని కథనంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. చిరంజీవి రిజెక్ట్ చేసిన జోష్ మూవీ కథను నాగార్జున, నాగచైతన్య ఓకే చేయగా ఈ సినిమా ఫ్లాపైంది. దిల్ రాజు ఓవర్ కాన్ఫిడెన్స్ తో నిర్మించిన ఈ సినిమా చైతన్య కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు.

జోష్ సినిమాలో చైతన్య లుక్ పై కూడా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత చైతన్య – దిల్ రాజు కాంబోలో చాలా సంవత్సరాల పాటు సినిమా రాలేదు. గతేడాది ఈ కాంబినేషన్ లో థాంక్యూ పేరుతో మరో సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు చైతన్య ఎందుకు ? ఓకే చెప్పాడా అని అక్కినేని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. ప్రేమమ్ తో సక్సెస్ సాధించిన చైతన్య అదే తరహా ఛాయలతో ఉన్న మరో కథలో ఎందుకు నటించాడో ఫ్యాన్స్ కు అర్థం కాలేదు. ఈ సినిమాకు విక్రమ్ కె కుమార్ దర్శకుడు అయినా ఈ సినిమాపై ఆయన ముద్ర అస్సలు లేదు.

థాంక్యూ సినిమా చైతన్య కెరీర్ కు కొత్త ఇబ్బందులను క్రియేట్ చేసింది. వ‌రుస హిట్ల‌తో స్వింగ్‌లో ఉన్న చైతు కెరీర్‌కు థ్యాంక్యూ స‌డెన్ బ్రేకులు వేసింది. దిల్ రాజు నాగచైతన్య కెరీర్ ను నాశనం చేయడానికే ఈ హీరోతో సినిమాలు నిర్మించాడా ? అంటూ కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నాగచైతన్య దిల్ రాజు బ్యానర్ లో మళ్లీ నటించవద్దని కొంతమంది సూచనలు చేస్తున్నారు. ఈ కామెంట్ల విషయంలో నాగచైతన్య ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news