MoviesRRR ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ అవార్డా..? ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి...

RRR ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ అవార్డా..? ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి సంచలన కామెంట్స్..!!

ప్రజెంట్ ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుతమైన సినిమా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుని హాలీవుడ్ లోనూ సత్తా చాటుతుంది . రీసెంట్ గానే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ మరోసారి అదే రికార్డుల పరంపర కొనసాగించింది . రీసెంట్ గా హాలీవుడ్ క్రిటిక్ అవార్డ్స్ లో ఏకంగా నాలుగు కేటగిరీల్లో విజయం సాధించి తెలుగు సినిమా సత్తా చాటింది . ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా సభ్యులకు పలువురు స్టార్స్ విషెస్ చెప్తున్నారు .

త్వరలోనే ఆస్కార్ కూడా కచ్చితంగా అందుకుంటుంది అని .. మన తెలుగు చరిత్ర ను ప్రపంచ దేశాలకు చాటి చెప్తుందని .. ఆశాభ్యాసం వ్యక్తం చేస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి చాలా హుషారు గల వ్యక్తి ..సినిమా ఇండస్ట్రీలోను బిజినెస్ పరంగా ఫ్యామిలీకి ఎంతో సపోర్ట్ ఇస్తూ ఉంటారు . రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ కి వచ్చిన అవార్డ్స్ పై స్పందిస్తూ ..సంచలన కామెంట్స్ చేసారు.

ఈ క్రమంలోని తన కొడుకులుగా భావించే చరణ్ – తారక్ ఇంత పెద్ద సక్సెస్ అందుకున్నందుకు ఆమె చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అంతేకాదు కచ్చితంగా ఆరారార్ సినిమా ఆస్కార్ కొడుతుందని.. తనకి నమ్మకం ఉందని గట్టిగా చెప్పారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకుంటే చూడాలని ఉంది అని.. త్వరలోనే ఆరోజు మనకి రాబోతుంది అంటూ శ్యామల దేవి చెప్పుకొచ్చారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ఇంతటి పేరు ప్రతిష్ట సంపాదించుకోవడంతో కొందరు హాలీవుడ్ స్టార్స్ మండిపడుతున్నారు . ఆర్ ఆర్ ఆర్ కి అంత సీన్ లేదు అంటూ చెత్త కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఆరారార్ సినిమా ఆస్కార్ కొట్టి వాళ్ళ నోరు మూయిస్తుందో..లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news