MoviesJabardasth Comedians గెటప్ శ్రీను - సుడిగాలి సుధీర్ మధ్య చిచ్చు...

Jabardasth Comedians గెటప్ శ్రీను – సుడిగాలి సుధీర్ మధ్య చిచ్చు పెట్టింది ఆమెనా..? మంచి ఫ్రెండ్స్ ని విడతీసేసారుగా మేడమ్..!!

జబర్దస్త్ కమెడియన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న గెటప్ శ్రీను- సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఎంతో కష్టపడినా ఈ కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా పాపులారిటి సంపాదించుకున్నారు . ఆ విషయం స్వయాన వాళ్లే చెప్పుకొచ్చారు . కాగా జబర్దస్త్ లో జాన్ జిగిడి దోస్త్ లు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా గెటప్ శ్రీను – సుడిగాలి సుదీర్ -రాంప్రసాద్ అని చెప్పాలి. జబర్దస్త్ స్టార్టింగ్ మొదలు కలిసి స్కిట్స్ వేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముగ్గురు ..స్కిట్స్ కోసమే కాకుండా లైఫ్ లో కూడా మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు .

ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా, ఈవెంట్స్ అయినా ఏ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటున్నారు . అయితే ఇంత మంచి ఫ్రెండ్స్ విడిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఎస్ గెటప్ శ్రీను -రాంప్రసాద్ -సుడిగాలి సుధీర్ దూరమయ్యారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అంతేకాదు పరిస్థితులన్నీ చూస్తుంటే అవే నిజమని గెటప్ శ్రీను -సుడిగాలి సుదీర్ -రాంప్రసాద్ దూరంగా నే ఉన్నారు అంటూ తెలుస్తుంది.

అయితే అలా దూరంగా ఉండడానికి కారణం జబర్దస్త్ లో ఉండే ఓ లేడీ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. రాంప్రసాద్ హెల్త్ బాగోలేనప్పుడు గెటప్ శ్రీను – సుడిగాలి సుధీర్ ఆయనకు డబ్బు పరంగా హెల్ప్ చేశారని ..ఆ డబ్బును ఆ లేడీ దగ్గరనుండే అప్పుగా తీసుకున్నారని..అయితే…అప్పు తిరిగి ఇవ్వాల్సిన టైంలో సుడిగాలి సుదీర్ – గెటప్ శ్రీను మధ్య గొడవలు మొదలయ్యాయని ..ఆ కారణంగానే వీళ్ళు దూరంగా ఉన్నారంటూ తెలుస్తుంది . మొత్తానికి జబర్దస్త్ లో టాప్ కమెడియన్స్ గా పేరు సంపాదించుకున్న ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ని ఒకే ఒక చిన్న కారణం చేత సక్సెస్ఫుల్గా విడదీసింది ఆ మహా మాయలేడి అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు. అంతే కాదు మళ్లీ వీరు కలిస్తే చూడాలి అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి గెటప్ శ్రీను -సుడిగాలి సుధీర్ -రాంప్రసాద్ ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news