NewsHansika "అలా చేస్తే మీకేంట్రా నొపి"..హన్సిక ఇచ్చిపడేసిందిగా..!!

Hansika “అలా చేస్తే మీకేంట్రా నొపి”..హన్సిక ఇచ్చిపడేసిందిగా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న హన్సిక మోత్వాని.. గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టార్ హీరో అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . తెలుగులో స్టార్ హీరోయిన్గా మారిపోయిన హన్సిక.. కోలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్యమేలేసింది..

రీసెంట్ గా బిజినెస్ మాన్ సోహెల్ ఖతూరియా ని ప్రేమించి పెళ్లి చేసుకున్న హన్సిక ..పెళ్లి తర్వాత కూడా సినిమాలో నటించేందుకు సిద్ధపడుతుంది. హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. కాగా హన్సిక మోత్వాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ ఎక్కువుగా జరుగుతుంది. నీ ఫ్రెండ్ మొగుడిని చేసుకోవడానికి సిగ్గు లేదా ..? అంటూ సూటిగానే ప్రశ్నిస్తున్నారు కొందరు ఫాన్స్.

కొందరు నీ కారణంగానే వాళ్లు విడిపోయారు.. ఆ పాపం నీకు ఊరికే పోదు అంటూ కామెంట్స్ చేశారు . ఈ క్రమంలోని హన్సిక క్లారిటీ ఇచ్చింది. ” గతంలో ఒకరితో రిలేషన్ లో ఉన్న ఆ విషయం మీకు తెలుసు ..కానీ ఈసారి బయటికి వస్తే నా భర్తతోనే రావాలి అనుకున్న .. ఎవ్వరికి విమర్శించే ఛాన్స్ ఇవ్వద్దు అని ఫిక్స్ అయ్యా.. నా భర్త విడాకులకు నాకు ఏ సంబంధం లేదు “అంటూ లవ్ షాది డ్రామా పేరుతో హన్సిక వెడ్డింగ్ వీడియోను హాట్ స్టార్ లో రిలీజ్ చేసింది.

కాగా దీనిపై హన్సిక ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . ఎంతోమంది హీరో హీరోయిన్స్ పెళ్లికి ముందు ప్రేమించుకుని విడిపోయి ఆ తర్వాత వేరే వాళ్లను చేసుకున్నారు ..వాళ్ళందరి విషయంలో లేని బాధ నొప్పి హన్సిక విషయాల్లో మీకెందుకు రా..?” అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే హన్సిక పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news