MoviesMahesh Babu వామ్మో..మహేష్ మరదలు అంత పెద్ద స్టార్ హీరోయినా.. ఆమె...

Mahesh Babu వామ్మో..మహేష్ మరదలు అంత పెద్ద స్టార్ హీరోయినా.. ఆమె నటించిన ఏకైన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటారు ఈ జంట . రీసెంట్ గా సోషల్ మీడియాలో నమ్రత సిస్టర్ కి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి . చాలామందికి నమ్రత కి చెల్లెలు ఉంది అన్న విషయం తెలీదు . అక్క నమ్రత శిరోద్కర్ కంటే ముందే వెండితెరకు పరిచయమైంది శిల్పా శిరోద్కర్.

1989లో కళ్యాణ్ చక్రవర్తి హీరోగా నటించిన విడుదలైన బ్రష్స్టార్ అనే చిత్రంలో నటించారు ఆమె . ఈ సినిమా ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది . ఆ తర్వాత వరుసగా పలు బడా హిందీ సినిమాలో నటించిన ఈమె అప్పట్లో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది. అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న సంజయ్ దత్ , అనిల్ కపూర్ వంటి స్టార్స్ తో వరుసగా బ్యాక్ టు బ్యాక్ జతకట్టి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ఈ క్రమంలోనే 1992లో టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మోహన్ బాబు శిల్పా ని తెలుగు ఇండస్ట్రీకి ఇంటర్వ్యూ చేశారు .

1992లో విడుదలైన బ్రహ్మ అనే చిత్రంలో హీరోయిన్గా నటించారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్టుగా నిలిచింది. సినిమాలో శిల్ప గ్లామర్ తెలుగు జనాలను అట్రాక్ట్ చేసింది . ఆ తర్వాత ఆఫర్స్ వచ్చినా అమ్మడు సున్నితంగా రిజెక్ట్ చేశారు . కాగా ఆ తర్వాత యూకే కి చెందిన బ్యాంకర్ ఆపరేశ్ రంజిత్ ని పెళ్లి చేసుకొని యూకే లో సెటిల్ అయిపోయింది . ఇప్పటికి సినిమా ఇండస్ట్రీకి దూరంగా శిల్పా తన లైఫ్ మొత్తం భర్తకు పిల్లలకి అంకితం చేసేసింది . ఇలా ఇద్దరు అక్కచెల్లెలు పెళ్లికి ముందు స్టార్ హీరోయిన్స్ అయినా పెళ్లి తర్వాత చక్కగా గృహణిలు లా అత్తింటి పేరుని నిలబడుతున్నారు అంటూ మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news