MoviesSamyuktha Menon హీరోయిన్లు బాగా వాడే ఆ టాప్ హీరో సంయుక్త...

Samyuktha Menon హీరోయిన్లు బాగా వాడే ఆ టాప్ హీరో సంయుక్త మీన‌న్‌ను వ‌ద‌ల్లేదా…!

సంయుక్త మేనన్ లేటెస్ట్ పిక్స్ చూస్తే అబ్బా..వాడేద్దాం అని మేకర్స్ అందరికీ ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎర్రటి చీరలో నాభి సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ ఆ రకంగా దర్శనమిచ్చింది. మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ గ్లామర్ బ్యూటీ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

ఇందులో రానా దగ్గుబాటి సరసన నటించిన సంయుక్త మేనన్ తన అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సాధారణంగా గురూజీ త్రివిక్రం సినిమా అంటే హీరోయిన్స్ బాగా ఎలివేట్ అవుతారు. ఈ సినిమాకి త్రివిక్రం దర్శకుడు కాకపోయినా కూడా వెనకుండి నడిపించి అంతా ఆయనే కాబట్టి అమ్మడి మీద గురూజీ చేయి కూడా పడింది. అందుకే, సితారా సంస్థలో ఇంకో సినిమాను చేస్తుంది.

అలాగే తెలుగులో మరికొన్ని సినిమాలను కమిటైనట్టు తెలుస్తోంది. ఇక మన మేకర్స్‌కి మలయాళ భామల మీద మంచి ఆసక్తి ఉంటుంది. ముద్దుగా బొద్దుగా కనిపించే మలయాళ పరిశ్రమ హీరోయిన్స్ ఎక్స్‌ఫోజింగ్ చేయడంలోనూ అడ్డు చెప్పరు. క్రేజ్ రాకముందు నిత్యా మీనన్ కూడా డీప్‌గా ఎక్స్‌ఫోజింగ్ చేసింది. ఇక పర్ఫార్మెన్స్ పరంగా కూడా సినిమాకి బాగా ప్లస్ అవుతుంటారు.

ఇప్పుడు సంయుక్త మేనన్ కూడా మన మేకర్స్‌ను జనాలను బాగా ఆకట్టుకుంది. భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒకవైపు పవన్ కళ్యాణ్‌ను ఇంకోవైపు రానాను కాకాపడుతూ కనిపించింది. ఇలా ఉంటే ఏ ఛాన్స్ ఎవరూ మిస్ చేసుకోరు. ఇక ప్రస్తుతం అమ్మడు తమిళంలో హీరోయిన్స్‌ను బాగా వాడే హీరో అని పేరున్న వాళ్ళతో నటించింది. త్వరలో ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. దీనినిబట్టి ఈ మలయాళ కుట్టిని దొరికిన వాళ్ళు దొరికినట్టు వాడేస్తారని చెప్పుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news