Moviesరామ్ పోతినేని లవ్ ఫెయిల్యూరా..? ఆమెను ప్రాణంగా ఎక్కువుగా ప్రేమించాడా..?

రామ్ పోతినేని లవ్ ఫెయిల్యూరా..? ఆమెను ప్రాణంగా ఎక్కువుగా ప్రేమించాడా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెళ్లికాని ప్రసాదులు చాలామంది ఉన్నారు . పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వడం కంటే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ట్యాగ్ చేయించుకోవడమే బెస్ట్ అనుకుంటూ అలా జీవితాన్ని కొనసాగించేస్తున్నారు . అదే లిస్టులోకి వస్తాడు టాలీవుడ్ హీరో రామ్ పోతినేని .. ఇతగాడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. దేవదాసు సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ఎనర్జిటిక్ హీరో ..ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ స్టార్ హీరోగా మారిపోయాడు.

హిట్లు ప్లాపులను సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ స్టార్ హీరోలకు సైతం టఫ్ కాంపిటీషన్ ఇస్తూన్న రామ్ పోతినేని లవ్ ఫెయిల్యూర్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే నా పోతినేని లవ్ ఫెయిల్యూరా..? అంటూ ఆయన అభిమానులు షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే రామ్ పోతినేని చాలా సైలెంట్ ..చూసేందుకు కాదు ..సెట్స్ లో కూడా తన పని తాను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ..కాంట్రవర్షీయల్ మేటర్ లో వేలు పెట్టడు. ఒకరు ఒక మాట అన్నా లైట్ గా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు .

మరి అలాంటి రామ్ పోతినేని ని రిజెక్ట్ చేసిన అమ్మాయి ఎవరు అంటూ ఇంట్రెస్టింగ్ చేర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. అయితే రామ్ పోతినేని ని రిజెక్ట్ చేసింది సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు .. తన క్లాస్మేట్ ..చిన్నప్పటినుంచి తనతో కలిసి చదువుకున్నా అమ్మాయి .. ఆమెకూడా రామ్ ని ఇష్టంగా ప్రేమించిందట. అయితే ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారట.

కాగా క్యాస్ట్ పరమైన ఫీలింగ్ తో అమ్మాయి ఇంట్లోని వాళ్ళు తనకి వేరే పెళ్లి చేసేసారట . ఇదే క్రమంలో ఫుల్ డిసప్పాయింట్ అయిన రామ్.. తన పెళ్లి మాట ఎత్తితేనే ఇంట్లో మండిపడుతున్నాడట . ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా కవర్ చేస్తూ ఏవేవో రీజన్స్ చెప్తూ వస్తున్నాడు అంటూ సినీ వర్గాలలో బలంగా టాక్ వినిపిస్తుంది. పాపం..రామ్ లవ్ ఫెయిల్యూర్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఓ అమ్మాయిని మర్చిపోవాలంటే మరో అమ్మాయి దగ్గర అవ్వాలి బాసు అంటూ కుర్రాళ్ళు హాట్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news